టైటిల్‌కు చేరువలో... | US Open 2025: Ayush Shetty wins maiden title, Tanvi Sharma finishes as runner-up | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు చేరువలో...

Jun 30 2025 8:17 AM | Updated on Jun 30 2025 8:17 AM

US Open 2025: Ayush Shetty wins maiden title, Tanvi Sharma finishes as runner-up

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో ఆయుశ్, తన్వీ శర్మ

అయోవా (అమెరికా): ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌లో ఈ ఏడాది భారత క్రీడాకారులెవరూ ‘సూపర్‌’ స్థాయి టోరీ్నల్లో టైటిల్‌ సాధించలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే ... ఒకేసారి రెండు టైటిల్స్‌తో భారత షట్లర్లు ‘డబుల్‌’ ధమాకా సృష్టించే అవకాశముంది. ఏమాత్రం అంచనాలు లేకుండా యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో బరిలోకి దిగిన భారత యువ షట్లర్లు ఆయుశ్‌ శెట్టి, తన్వీ శర్మ టైటిల్‌కు కేవలం విజయం దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ 34వ ర్యాంకర్‌ ఆయుశ్‌ శెట్టి... మహిళల సింగిల్స్‌లో విభాగంలో ప్రపంచ 66వ ర్యాంకర్‌ తన్వీ శర్మ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

 పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆయుశ్‌ శెట్టి 21–23, 21–15, 21–14తో టాప్‌ సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై సంచలన విజయం సాధించగా... 16 ఏళ్ల తన్వీ శర్మ 21–14, 21–16తో ఏడో సీడ్, ప్రపంచ 40వ ర్యాంకర్‌ పొలీనా (ఉక్రెయిన్‌)ను బోల్తా కొట్టించింది. ఫైనల్స్‌లో బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా)తో ఆయుశ్‌; బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)తో తన్వీ తలపడతారు. గత నెలలో శ్రీకాంత్‌ మలేసియా ఓపెన్‌ టోరీ్నలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలవడమే ఈ ఏడాది భారత షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన. ఫైనల్లో ఆయుశ్, తన్వీ విజయం సాధిస్తే భారత్‌కు ‘టైటిల్‌’ లోటు తీరుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement