US Open 2022: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు

US Open: Wu Yibing Become 1st Chinese Man Win Grand Slam Match Since 1959 - Sakshi

చైనాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు యూ వైబింగ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్‌ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్‌ అయిన యూ వైబింగ్‌.. తొలి రౌండ్‌లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్‌ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు.

కాగా 22 ఏళ్ల యూ వైబింగ్‌ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు.. 31 విన్నర్‌లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్‌ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్‌ గయ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్‌ ఆటగాడు యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్‌ మాత్రమే యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు.

కాగా 2017లో జూనియర్‌ చాంపియన్‌గా నిలిచిన యూ వైబింగ్‌ ఆ తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్‌లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్‌ టెన్నిస్‌కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్‌ ర్యాంక్‌ 1869.  అయితే వరుసగా 14 మ్యాచ్‌లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్‌ తన తర్వాతి మ్యాచ్‌ పోర్చుగీస్‌కు చెందిన నునో బోర్జెస్‌తో ఆడనున్నాడు.

చదవండి: US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top