
ముంబై: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు.














