Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ

టెన్నిస్‌లో ఆ ఇద్దరిని దిగ్గజాలుగా అభివర్ణిస్తారు. ఒకరు పురుషుల టెన్నిస్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంటే.. మరొకరు మహిళల టెన్నిస్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందుతుంది. ఒకేసారి ఈ ఇద్దరు ఎదురుపడితే అది అద్భుత దృశ్యం కాకుండా ఉంటుందా. అందుకే యూఎస్ ఓపెన్ నిర్వాహకులు..''ఆర్థర్ ఆషే స్టేడియం GOAT Farmగా(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా మారిపోయింది.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆ ఇద్దరే అమెరికన్ నల్లకలువ సెరెనా విలియమ్స్.. మరొకరు స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్.
Photo Credit: US Open
విషయంలోకి వెళితే.. సోమవారం(ఆగస్టు 29 నుంచి) యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ సమయంలో సెరెనా, నాదల్‌లు ఒకరినొకరు ఎదురుపడ్డారు. నాదల్ ప్రాక్టీస్ చేయడానికి కోర్టులోకి వస్తుంటే.. అదే సమయంలో సెరెనా ప్రాక్టీస్ ముగించుకొని వెళుతుంది. దీంతో ఇద్దరు ఒకరినొకరు పలకరించుకొని హగ్ చేసుకున్నారు. ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్ కలిస్తే మాములుగా ఉంటుందా.. ప్రాక్టీస్ చూడానికి వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియలో వీడియో వైరల్‌గా మారింది.
Photo Credit: US Open
ఇక సెరెనా, నాదల్‌లు ఎవరికి వారే సాటి. మహిళల టెన్నిస్‌లో ఓపెన్ శకంలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో సెరెనా విలియమ్స్ కొత్త చరిత్ర సృష్టించింది. మరొక టైటిల్ సాధిస్తే.. మహిళల ఆల్‌టైం టెన్నిస్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్(24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) సరసన చోటు సంపాదిస్తుంది. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పురుషుల టెన్నిస్ విభాగంలో ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. ఇక యూఎస్ ఓపెన్ అనంతరం సెరెనా టెన్నిస్ నుంచి లాంగ్‌బ్రేక్ తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. యూఎస్ ఓపెన్‌లో సెరెనా తొలి రౌండ్‌లో మోంటెన్‌గ్రోకు చెందిన డన్‌కా కోవినిక్‌తో తలపడనుంది.
ఇక 23 గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నాదల్ ఆస్ట్రేలియాకు చెందిన రింకీ హిజికతాతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇక స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
Arthur Ashe Stadium has become a GOAT farm 🐐@serenawilliams 😍 @RafaelNadal | #USOpen pic.twitter.com/77S3GFibHS
— US Open Tennis (@usopen) August 24, 2022
చదవండి: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..
సంబంధిత వార్తలు