‘ఓపిక నశిస్తోంది’.. జకోవిచ్‌ సంచలన వ్యాఖ్యలు! | Djokovic Proposed Changes-Tennis-Game-Rules-Attract-Modern Audience | Sakshi
Sakshi News home page

Novak Djokovic: ‘ఈ తరానికి ఓపిక తక్కువ.. టెన్నిస్‌లో మార్పులు అవసరం!’

Aug 4 2026 12:19 PM | Updated on Aug 4 2026 12:34 PM

Djokovic Proposed Changes-Tennis-Game-Rules-Attract-Modern Audience

Photo Credit: ATP Twitter

సెర్బియా టెన్నిస్ దిగ్గ‌జం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నొవాక్ జ‌కోవిచ్ టెన్నిస్ ఆట‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈత‌రం అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకొని టెన్నిస్ ఆట‌లో స్కోరింగ్‌లో మార్పులు చేయాల్సిన అవ‌స‌రముంద‌న్నాడు. తాము గంట‌ల కొద్ది మ్యాచ్‌లు ఆడుతుంటే చూసేవారి సంఖ్య త‌గ్గిపోతున్న‌ట్లుగా అనిపిస్తోందని తెలిపాడు. 

అందుకే మేజ‌ర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బెస్ట్ ఆఫ్ ఐదును య‌థాత‌థంగా కొన‌సాగిస్తూనే, మ్యాచ్‌లను సులభంగా అర్థం చేసుకోవడానికి నో-యాడ్ స్కోరింగ్‌తో నాలుగు-గేమ్‌ల సెట్‌లకు మార్చాలని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. నిక్ నోస్‌బాల్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌కోవిచ్ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

'టెన్నిస్‌లో స్కోరింగ్ విధానాన్ని మార్చాల్సిన అవ‌స‌ర‌ముంది. సెట్‌లో ఆరు గేముల‌కు బదులు నాలుగు గేములకు కుదించాలి. బెస్ట్ ఆఫ్ ఫైవ్ సెట్స్ ప‌ద్ధ‌తిని కొన‌సాగిస్తూనే, మ్యాచ్‌ల‌ను రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ముగించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఈత‌రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి టెన్నిస్ ఆట‌లో మార్పులు అవ‌స‌ర‌మ‌నిపిస్తోంది. 

ముఖ్యంగా పాడెల్‌, పికల్‌బాల్ వంటి క్రీడ‌లు ప్రాచుర్యం పొందుతున్న వేళ, టెన్నిస్ ఆట‌లో సంప్ర‌దాయ స్కోరింగ్ విధానం కొత్త‌గా చూస్తున్న అభిమానుల‌కు గంద‌ర‌గోళంగా అనిపించ‌వ‌చ్చు. అందుకే ఆట‌ను వీలైనంత మేర‌కు స‌ర‌ళ‌మైన విధానానికి తీసుకొస్తే ఆట‌గాళ్ల‌కు, ప్ర‌సార‌క‌ర్త‌ల‌కు, చూసే ప్రేక్ష‌కుల‌కు కూడా ప్ర‌యోజ‌నం చేకూరుతుంది' అని జ‌కోవిచ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

త‌న కెరీర్‌లో ఎన్నో మార‌థాన్ మ్యాచ్‌లు ఆడిన జ‌కోవిచ్ ఈ వ్యాఖ్య‌లు చేయడం ఆస‌క్తిగా మారాయి. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జ‌కోవిచ్ ఈ మ‌ధ్యకాలంలో మేజ‌ర్ టోర్నీలో మార‌థాన్ మ్యాచ్‌ల‌నే ఎక్కువ‌గా ఆడాల్సి వ‌స్తోంది. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సెమీస్‌లో జానిక్ సిన్న‌ర్‌ను ఐదు సెట్ల పోరులో ఓడించిన‌ప్ప‌టికీ, ఫైన‌ల్లో అల్క‌రాజ్ చేతిలో ఓట‌మి పాల‌య్యి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకున్నాడు. 

తాజాగా వింబుల్డ‌న్‌లో ఫెలిక్స్ ఆగ‌ర్‌తోనూ సుదీర్ఘ మ్యాచ్ ఆడి గెలిచిన జ‌కోవిచ్ సెమీస్‌లో మాత్రం సిన‌ర్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫోనెక్సాతో ఐదు సెట్ల హోరాహోరి పోరు జ‌రిగిన‌ప్ప‌టికీ జ‌కోవిచ్‌కు ప‌రాభ‌వ‌మే మిగిలింది. ఒక‌వేళ జ‌కోవిచ్ చేసిన ప్ర‌తిపాద‌నను టెన్నిస్ స‌మాఖ్య ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మాత్రం ఆట తీరు స‌మూలంగా మారిపోనుంది. 

సెట్‌లను ఆరు గేమ్‌ల నుండి నాలుగుకు తగ్గించడం మరియు నో-యాడ్ స్కోరింగ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రతి పాయింట్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, దీనితో ఒకే ఒక్క సర్వీస్ బ్రేక్ మొత్తం సెట్‌నే నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ద‌శాబ్దంలో టెన్నిస్‌ను ఏలిన జ‌కోవిచ్ తాజాగా టెన్నిస్ ఆట‌లో మార్పులు అవ‌స‌ర‌మని చెప్ప‌డం కాస్త ఆలోచించాల్సిన విష‌యం.

చదవండి: ఆసీస్‌, ఇంగ్లండ్‌ వల్ల కాలేదు.. చ‌రిత్ర సృష్టించిన‌ బీసీసీఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement