అనుకోకుండా ఛాన్స్‌.. కట్ చేస్తే! సూప‌ర్ సెంచ‌రీతో | West Indies Vs Pakistan, Abdullah Shafique And Babar Puts Pakistan In Strong Position In 2nd Test, Check Out Details | Sakshi
Sakshi News home page

PAK vs SL: అనుకోకుండా ఛాన్స్‌.. కట్ చేస్తే! సూప‌ర్ సెంచ‌రీతో

Aug 4 2026 9:38 AM | Updated on Aug 4 2026 10:02 AM

Shafique, Babar put Pakistan on top against West Indies

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ప‌ట్టు బిగించింది. తొలి టెస్టులో ఘెరంగా విఫ‌ల‌మైన పాక్ బ్యాట‌ర్లు..సెకెండ్ మ్యాచ్‌లో మాత్రం స‌త్తాచాటుతున్నారు. 

రెండో రోజు ఆట‌ముగిసే స‌మయానికి పాక్ జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో  2 వికెట్లు కోల్పోయి 266 ప‌రుగులు చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య‌ జ‌ట్టు కంటే పాక్ కేవ‌లం 78 ప‌రుగుల వెన‌కంజ‌లో మాత్ర‌మే ఉంది.

ష‌ఫీక్ సూప‌ర్ సెంచ‌రీ
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ వ‌న్ డౌన్ బ్యాట‌ర్ అబ్దుల్లా షఫీక్ అద్భుత సెంచరీతో చెల‌రేగాడు. ష‌ఫీక్ 173 బంతుల్లో త‌న ఆరువ టెస్ట్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. వాస్త‌వానికి వెండీస్‌తో టెస్టుల‌కు తొలుత ప్ర‌క‌టించిన పాక్ జ‌ట్టులో ష‌ఫీక్‌కు చోటు ద‌క్క‌లేదు. 

అబ్దుల్లా ఫజల్ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో ష‌ఫీక్‌ను విండీస్‌కు సెల‌క్ట‌ర్లు పంపించారు. ఇప్పుడు త‌నకు ల‌భించిన అవ‌కాశాన్ని అత‌డు అందిపుచ్చుకున్నాడు. అబ్దుల్లా 107 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అత‌డితో పాటు కెప్టెన్ బాబ‌ర్ ఆజం(86) క్రీజులో ఉన్నాడు. 

అదేవిధంగా యువ ఓపెన‌ర్ యువ బ్యాటర్ అజాన్ అవైస్ (55) కూడా హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. అంత‌కుముందు ఓవర్‌నైట్ స్కోరు 239/5తో సోమవారం రెండో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది.

జస్టిన్ గ్రీవ్స్ (73), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (70) ఆకట్టుకునే అర్ధశతకాలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ అలీ, ఉబైడ్‌ షా, అలీ ఉస్మాన్‌ తలా రెండు వికెట్లు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement