పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌ | Pakistan Coach Leaves Team Suddenly | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌

Jul 11 2026 7:20 PM | Updated on Jul 11 2026 7:38 PM

Pakistan Coach Leaves Team Suddenly

పాకిస్తాన్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు పరిమిత ఓవర్ల ఫీల్డింగ్ కోచ్ షేన్ మెక్‌డెర్మాట్ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆసియా గేమ్స్‌-2026కు కొన్ని నెలల ముందు మెక్‌డెర్మాట్ తప్పుకోవడం పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆస్ట్రేలియాలోని టాస్మేనియాకు చెందిన షేన్ మెక్‌డెర్మాట్.. గత ఏడాది జూలైలో పాక్ వైట్ బాల్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి హయంలో పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడ్డాయి. మెక్‌డెర్మాట్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు అఫ్గానిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి పర్యవేక్షణలోనే అఫ్గానిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌-2024లో సెమీఫైనల్‌కు చేరింది.  

ఏదేమైనప్పటికి ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు మెక్‌డెర్మాట్‌ రాజీనామా చేయడం పాక్‌ క్రికెట్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కాగా పాక్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా బాబర్‌ ఆజం తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. టీ20ల్లో కూడా బాబర్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement