టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో ఓ భారత అభిమానికి పోర్చుగల్ క్రికెట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోర్చుగల్ క్రికెట్ చేసిన కామెంట్ క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
పోర్చుగల్ క్రికెట్ జట్టు తమ చివరి 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం రెండు పరాజయాలు మాత్రమే చవిచూసిందంటూ క్రికెట్ పోర్చుగల్ సోషల్‌మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ భారత అభిమాని, "ఈ పోర్చుగల్ అకౌంట్ ఐర్లాండ్ నుంచి నడుస్తున్నట్టుంది" అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై పోర్చుగల్ క్రికెట్ స్పందిస్తూ, "ఐర్లాండ్ గురించి నిజంగానే మాట్లాడాలనుకుంటున్నావా..?" అంటూ ఒక్క వాక్యంతోనే కౌంటర్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్య భారత జట్టు ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఎదుర్కొన్న టీ20 సిరీస్ పరాజయాన్ని ఉద్దేశించిందని అభిమానులు భావిస్తున్నారు. ఆ సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతుంది.
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత యూరప్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, డబ్లిన్‌లో జరిగిన రెండు టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో ఓడి చరిత్రలో తొలిసారి ఆ జట్టు చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆతర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా పరాజయాలు చవిచూసి, ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో నామమాత్రను చివరి టీ20 ఇవాళ జరుగునుంది.
శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ భారీ ప్రెషర్‌ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి తరుణంలో క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న పోర్చుగల్ లాంటి దేశం టీమిండియాకు కౌంటరివ్వడం గమనార్హం.


