భారత స్ప్రింటింగ్‌లో సరికొత్త చరిత్ర | Animesh Kujur runs fastest-ever 100m by an Indian abroad, finishes second in Germany | Sakshi
Sakshi News home page

భారత స్ప్రింటింగ్‌లో సరికొత్త చరిత్ర

Jul 11 2026 4:43 PM | Updated on Jul 11 2026 4:52 PM

Animesh Kujur runs fastest-ever 100m by an Indian abroad, finishes second in Germany

కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవుతున్న భారత స్టార్ స్ప్రింటర్ అనిమేష్ కుజూర్ చరిత్ర సృష్టించాడు. జర్మనీలో జరిగిన ఫాస్ట్ ఆర్మ్స్ ఫాస్ట్ లెగ్స్ అథ్లెటిక్స్ మీట్‌లో 100 మీటర్ల పరుగును కేవలం 10.14 సెకన్లలో పూర్తి చేసి, విదేశీ గడ్డపై అత్యంత వేగవంతమైన టైమింగ్‌ను నమోదు  చేసిన భారత అథ్లెట్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఛాలెంజర్ పోటీల్లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్‌లో 23 ఏళ్ల అనిమేష్ ఫైనల్లో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తూ రన్నరప్‌గా నిలిచాడు. అంతకుముందు హీట్స్‌లో 10.19 సెకన్లలో రేసును ముగించిన అతడు, ఫైనల్లో మరింత మెరుగ్గా పరుగెత్తి 10.14 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు.

ఈ ప్రదర్శనతో అనిమేష్‌ భారత అథ్లెటిక్స్ చరిత్రలో (100 మీటర్ల విభాగంలో) రెండో అత్యుత్తమ టైమింగ్ సాధించిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ రికార్డు గురిందర్‌వీర్ సింగ్ (10.09 సెకన్లతో)  పేరిట కొనసాగుతోంది. గురిందర్‌ గత మే నెలలో రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఈ టైమింగ్‌ను నమోదు చేశాడు.

తాజా ఘనత తర్వాత భారత టాప్‌-5 100 మీటర్ల టైమింగ్‌లలో మూడు అనిమేష్‌ ఖాతాలో చేరాయి. గురిందర్‌వీర్ రికార్డు సృష్టించే ముందు కూడా ఆ రికార్డు అనిమేష్ పేరిటే ఉండేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement