వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. స్టార్ క్రికెట‌ర్ స‌డ‌న్ రిటైర్మెంట్‌ | Jason Holder Takes Shocking Retirement | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. స్టార్ క్రికెట‌ర్ స‌డ‌న్ రిటైర్మెంట్‌

Jul 11 2026 4:18 PM | Updated on Jul 11 2026 4:24 PM

Jason Holder Takes Shocking Retirement

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ జాస‌న్ హోల్డ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. 34 ఏళ్ల హోల్డ‌ర్ వ‌న్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని హోల్డ‌ర్ బ‌హిరంగంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికి.. విండీస్ హెడ్ కోచ్ డార‌న్ సామీ మాత్రం అధికారికంగా ధ్రువీక‌రించాడు.

ఈ కరేబియన్ ఆల్‌రౌండర్‌ గ‌త కొంత కాలంగా కేవ‌లం టీ20ల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో తిరిగి వన్డేల్లో వస్తాడని అంతా భావించారు. కానీ అతడు మాత్రం సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు.

"హెల్డర్ తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశముంది. కానీ అతడు ఇప్పటికే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడ‌ని నాకు తెలుసు. టెస్టు క్రికెట్ తిరిగి ఆడుతాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. ఎందుకంటే రెడ్‌బాల్ క్రికెట్‌పై అత‌డికి మ‌క్కువ ఎక్కువ‌. అత‌డు మా ప్ర‌ధాన ఆల్‌రౌండ‌ర్" అని సామీ  'విజ్డెన్ క్రికెట్ పాడ్‌కాస్ట్' లో పేర్కొన్నాడు. 

కాగా 2013లో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన జేసన్ హోల్డర్ వెస్టిండీస్ జట్టులో సుదీర్ఘ కాలం కీల‌క స‌భ్యునిగా ఆడాడు. దాదాపు రెండేళ్ల పాటు విండీస్ జ‌ట్టు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డు విండీస్ త‌ర‌పున చివ‌ర‌గా 2023లో వ‌న్డే మ్యాచ్‌ ఆడాడు. వెస్టిండీస్ జ‌ట్టు ప్ర‌స్తుతం స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది.

జేసన్ హోల్డర్ వన్డే కెరీర్ గ‌ణాంకాలు ఇవే
మ్యాచ్‌లు: 138

పరుగులు: 2237

అర్ధ సెంచరీలు : 12

వికెట్లు: 159

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement