శ్రీలంక‌పై వెస్టిండీస్ ఘ‌న విజ‌యం | Jason Holder, Shamar Joseph put WI 1-0 up | Sakshi
Sakshi News home page

శ్రీలంక‌పై వెస్టిండీస్ ఘ‌న విజ‌యం

Jun 12 2026 1:05 PM | Updated on Jun 12 2026 1:08 PM

Jason Holder, Shamar Joseph put WI 1-0 up

శ్రీలంక‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శుక్ర‌వారం కింగ్‌స్ట‌న్ వేదికగా జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌(51), కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(36) మినహా మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో స్పీడ్‌ స్టార్లు జాసన్‌ హోల్డర్‌, షమీర్‌ జోషఫ్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బ తీశారు.

అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్‌ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌(65 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటగా, బ్రాండన్‌ కింగ్‌(37) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. మలింగ ఓ వికెట్‌ తీశాడు. 

ఇరు జట్ల మధ్య రెండో టీ20 కింగ్‌స్టన్‌ వేదికగానే శనివారం జరగనుంది. కాగా ఇప్పటికే శ్రీలంకపై వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కరేబియన్స్‌ పట్టుదలతో ఉన్నారు.
చదవండి: షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement