షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు | Shreyas Iyer rents super-luxury flat in Mumbai | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

Jun 12 2026 11:44 AM | Updated on Jun 12 2026 11:51 AM

Shreyas Iyer rents super-luxury flat in Mumbai

టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ముంబైలో అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ 'స్క్వేర్ యార్డ్స్' ప్రకారం.. వర్లీ ప్రాంతంలో ఉన్న ఈ ఖరీదైన అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్‌  కోసం మూడేళ్ల కాలానికి గాను ఏకంగా రూ.7.14 కోట్లతో అయ్యర్‌ లీజు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఫ్లాట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు అయ్యర్‌కు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్‌లు కేటాయించబడ్డాయి. ఈ లీజ్ ఒప్పందం మొత్తం 36 నెలల  కాలపరిమితికి కుదిరింది. ప్రతి సంవత్సరం అద్దె సుమారు 7 శాతం చొప్పున పెరుగుతుంది.  

దీనికి సంబంధించి జూన్ 10న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముంబై రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

నెలవారీ అద్దె 
మొదటి సంవత్సరం- రూ.18.50 లక్షలు
రెండూ సంవత్సరం- రూ.19.79 లక్షలు
మూడో సంవత్సరం-రూ.21.18 లక్షలు

నూతన సాథిగా అయ్యర్‌
కాగా ఇటీవల శ్రేయస్‌ అయ్యర్‌ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ స్ధానంలో అయ్యర్‌కు జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. అయ్యర్‌ ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ నుంచి భారత కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారు.
చదవండి: IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం వాయిదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement