ప‌రుగు తేడాతో విజ‌యం.. లాస్ ఏంజిల్స్‌దే మేజ‌ర్ లీగ్ టైటిల్‌ | MLC 2026 Final, LA Knight Riders Beat Washington Freedom By One Run To Win Maiden Championship Title | Sakshi
Sakshi News home page

ప‌రుగు తేడాతో విజ‌యం.. లాస్ ఏంజిల్స్‌దే మేజ‌ర్ లీగ్ టైటిల్‌

Jul 19 2026 9:37 AM | Updated on Jul 19 2026 12:47 PM

Los Angeles Knight Riders Won-By-1 Run-Clinch Major League Title 2026

Photo Credit: Twitter

మేజ‌ర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లీగ్ 2026 విజేత‌గా లాస్ ఏంజిల్స్ నైట్‌రైడ‌ర్స్ నిలిచింది. వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్‌తో జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత‌ ఫైన‌ల్లో లాస్ ఏంజెల్స్ ప‌రుగు తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజెల్స్ 19.4 ఓవ‌ర్ల‌లో 164 పరుగుల‌కు ఆలౌటైంది. 

ఓపెన‌ర్లు ఆండ్రీ ఫ్లెచ‌ర్ (47), కొలిన్ మున్రో (40) రాణించ‌గా, మిడిలార్డ‌ర్‌లో మాథ్యూ ట్రోంప్ (39) ప‌ర్వాలేద‌నిపించారు. వాషింగ్ట‌న్ బౌల‌ర్ల‌లో బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు తీయ‌గా, మిచెల్ ఓవెన్‌, నికిల్ చౌద‌రీ, ర‌చిన్ ర‌వీంద్ర త‌లా 2 వికెట్లు ప‌డగొట్టారు. అనంత‌రం వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 163 ప‌రుగులు చేసి విజ‌యానికి ఒక్క ప‌రుగు దూరంలో ఆగిపోయింది. 

టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన వేళ మిడిలార్డ‌ర్‌లో ఓబ‌స్ పియెన్న‌ర్ (53) అర్ధ‌సెంచ‌రీ సాధించ‌గా, ఆండ్రీ గౌస్ (40) రాణించినప్ప‌టికీ ఆఖ‌ర్లో వికెట్లు చేజార్చుకొని ఒత్తిడికి లోన‌య్యి ప‌రాజ‌యం చ‌విచూసింది. లాస్ ఏంజెల్స్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్‌, జాస‌న్ హోల్డ‌ర్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) టోర్నీలో అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది.

 

చదవండి: పాక్‌తో టైటిల్‌ కంబాట్‌.. కళ్లన్నీ 40 ఏండ్ల సంగ్రామ్‌ పైనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement