సింధుదే జపాన్‌ ఓపెన్‌.. తొలి భారత షట్లర్‌గా రికార్డు | PV Sindhu Wins Japan Open 2026 Title, Becomes First Indian To Claim Super 750 Crown, More Details Inside | Sakshi
Sakshi News home page

సింధుదే జపాన్‌ ఓపెన్‌.. తొలి భారత షట్లర్‌గా రికార్డు

Jul 19 2026 10:01 AM | Updated on Jul 19 2026 12:42 PM

PV Sindhu Clinch-Japan Open Super 750 Title Beat Yamaguchi-Final

Photo Credit: ESPN Twitter

భారత టాప్‌ షట్లర్‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌-750 టోర్నీ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-17, 21-17తో అకానె యమగూచిపై  రెండు వరుస గేముల్లో విజయం సాధించింది. కాగా సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.

సింధుకు ఇదే తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కాగా భార‌త్ త‌ర‌ఫున జ‌పాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డుల‌కెక్కింది. కొంత‌కాలంగా స‌రైన ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న సింధు 19 నెల‌ల త‌ర్వాత ఒక మేజ‌ర్ టోర్నీ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.తొలి గేమ్ ఆరంభంలో సింధుకు య‌మ‌గూచి గ‌ట్టిపోటీనిచ్చింది. చెరో పాయింట్‌తో నువ్వా నేనా అన్న‌ట్లు సాగారు. కాని చివ‌ర్లో ఫుంజుకున్న సింధు వ‌రుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను గెలుచుకుంది.

ఇక రెండో గేమ్‌ ఆరంభం నుంచే పీవీ సింధు దూకుడు ప్రదర్శించడంతో యమగూచి వద్ద సమాధానం లేకుండా పోయింది. జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ పోరుకు ముందు యమగూచిపై సింధు రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది జ‌పాన్ ఓపెన్‌కు ముందు మూడుసార్లు త‌ల‌ప‌డితే ఇందులో రెండుసార్లు య‌మ‌గూచినే విజ‌యం సాధించింది. మలేషియా ఓపెన్‌లో యమగూచి మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ వెళ్లడంతో సింధుకు విజయం వరించింది. 

థాయ్‌లాండ్‌ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధుపై యమగుచి గెలిచింది. ఆ తర్వాత‌ ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ సింధుపై య‌మ‌గూచి పైచేయి సాధించింది. దీంతో జ‌పాన్ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధుపై ఒత్తిడి నెల‌కొంది. కానీ టైటిల్ పోరులో ఎక్క‌డా దానిని బ‌య‌ట‌పెట్ట‌ని సింధు య‌మ‌గూచికి త‌న సొంత‌గ‌డ్డ‌పై షాక్ ఇస్తూ విజ‌యం సాధించి మెయిడెన్ జ‌పాన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

 

 

Read: ప‌రుగు తేడాతో విజ‌యం.. లాస్ ఏంజిల్స్‌దే మేజ‌ర్ లీగ్ టైటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement