Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్‌పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్‌లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం.
దీంతో మెస్సీ రిటైర్మెంట్‌పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్‌ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు.
ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది.
ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు.
🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.
😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026


