Photo Credit: BCCI Twitter
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా తమ చివరి వన్డేను ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరి లార్డ్స్ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉంది, ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? గెలిచినవెన్నీ, ఓడినవెన్ని అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
లార్డ్స్‌లో భారత జట్టు అంతర్జాతీయంగా 31 మ్యాచ్‌లు (అన్ని ఫార్మాట్లు) ఆడితే ఏడు గెలిచి 19 ఓడింది. ఒక మ్యాచ్ టై కాగా, 14 డ్రాగా ముగిశాయి. లార్డ్స్ వేదికలో భారత్ ఓవరాల్ విన్నింగ్ శాతం 22.58 పర్సంటైల్‌గా ఉంది. వన్డేల్లో మాత్రం టీమిండియాకు లార్డ్స్ వేదికలో మంచి రికార్డే ఉంది. ఓవరాల్‌గా లార్డ్స్‌లో ఏడు గెలిస్తే అందులో మూడు వన్డేల నుంచే రావడం విశేషం.
మొత్తంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య 8 వన్డేలు జరిగితే టీమిండియా మూడు, ఇంగ్లండ్ నాలుగు చొప్పున గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. వన్డేల్లో లార్డ్స్ వేదికలో భారత విజయాల శాతం 37.5 పర్సంటైల్‌గా ఉంది. ఈ వేదికలో 2022, జూలై 14న భారత్, ఇంగ్లండ్ చివరిసారిగా వన్డే ఆడాయి.
ఈ వన్డేలో టీమిండియా 100 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మోయిన్ అలీ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పూర్తిగా తడబడిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. పాండ్యా, జడేజా చెరో 29 పరుగులు చేశారు. మ్యాచ్‌లో రీస్ టోప్లే ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.
లార్డ్స్ వేదికపై జరిగిన వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సౌరవ్ గంగూలీ (208 పరుగులు) తొలి స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ (170) రెండు, ఎంఎస్ ధోని (165) మూడు, రాహుల్ ద్రవిడ్ (149), సురేశ్ రైనా (130)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే చాహల్, ఆర్పీ సింగ్ ఐదేసి వికెట్లతో తొలి స్థానంలో ఉండగా, మొహిందర్ అమర్‌నాథ్, జహీర్ ఖాన్, మదన్‌లాల్‌లు తలా 4 వికెట్లు పడగొట్టారు.


