కామన్‌వెల్త్ గేమ్స్ ఫ్లాగ్‌ బేరర్స్‌గా మీరాబాయి, లవ్లీనా | Mirabai Chanu-Lovlina Borgohain Named Indias Flag Bearers CWG 2026 | Sakshi
Sakshi News home page

కామన్‌వెల్త్ గేమ్స్ ఫ్లాగ్‌ బేరర్స్‌గా మీరాబాయి, లవ్లీనా

Jul 18 2026 8:03 PM | Updated on Jul 18 2026 8:59 PM

Mirabai Chanu-Lovlina Borgohain Named Indias Flag Bearers CWG 2026

భారత దిగ్గజ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌కు గొప్ప గౌరవం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ భారత ఫ్లాగ్ బేరర్స్‌గా ఎంపికయ్యారు. భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.  

కామన్వెల్త్ గేమ్స్ భారత్ నుంచి వివిధ క్రీడల్లో మొత్తం 124 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందానికి మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించనున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కోలో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ నెల 23న ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ప్రారంభ వేడుకల్లో మీరాబాయి, లవ్లీనా జాతీయ జెండా చేతబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. 

ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష మాట్లాడుతూ.. మీరాబాను, లవ్లీనా భారత క్రీడ రంగానికి చేసిన అద్భుతమైన సేవలకు ఇది నిదర్శనమన్నారు. 'మీరాబాయి, లవ్లీనా ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం గర్వకారణంగా ఉంది. వారిద్దరూ అంతర్జాతీయ వేదికపై ఎన్నోసార్లు తమను తాము నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో లో కామన్వెల్ గేమ్స్ కోసం శిక్షణ పొందుతున్నారు.'అని ఉష తెలిపారు. 

Read: సిరీస్ విజ‌యంపై గురి.. లార్డ్స్‌లో టీమిండియాకు ఘన చరిత్ర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement