అచ్చొచ్చిన గేమ్స్‌ తొలగింపు.. కామన్‌వెల్త్‌లో భారత్‌ షెడ్యూల్‌ ఇదే | Check India-Full Schedule-At-Common-Wealth-Games 2026-Glasgow | Sakshi
Sakshi News home page

Glasgow-CWG 2026: అచ్చొచ్చిన గేమ్స్‌ తొలగింపు.. కామన్‌వెల్త్‌లో భారత్‌ షెడ్యూల్‌ ఇదే

Jul 22 2026 12:32 PM | Updated on Jul 22 2026 12:56 PM

Check India-Full Schedule-At-Common-Wealth-Games 2026-Glasgow

Photo Credit: CWG Twitter

రెండు నెల‌ల పాటు సాగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ యావ‌త్‌ క్రీడాభిమానుల‌ను ఉర్రూత‌లూగించింది. అయితే ఫిఫా టోర్నీ అలా ముగిసిందో లేదో మ‌రో ప్ర‌పంచ క్రీడా వేడుక‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మినీ ఒలింపిక్స్‌గా భావించే కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు నేటి నుంచే తెర‌లేవ‌నుంది. ఈసారి కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు గ్లాస్కో ఆతిథ్య‌మిస్తోంది. 

ఇక కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ గురువారం నుంచి త‌మ ఆట‌ను ప్రారంభించనుంది. జూలై 23 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు సాగ‌నున్న కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ ఏ విభాగాల్లో పోటీ పడుతుంద‌నేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం. ముఖ్యంగా మూడు విభాగాల్లో భార‌త్‌కు ఈసారి అధిక ప‌త‌కాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్ ఇందులో ఉన్నాయి. 

వ్య‌క్తిగ‌త విభాగాల్లో నీర‌జ్ చోప్రా మ‌రోసారి ఫెవ‌రెట్‌గా బ‌రిలోకి దిగుతుండ‌గా, లాంగ్‌జంప‌ర్ ముర‌ళీ శ్రీశంక‌ర్‌, ట్రిపుల్ జంప‌ర్ ప్ర‌వీణ్ చిత్ర‌వేల్‌, రన్న‌ర్ గుల్వీర్ సింగ్‌పై కూడా భారీ ఆశ‌లు ఉన్నాయి. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మ‌హిళ‌ల‌ 48 కేజీల విభాగంలో పోటీ ప‌డుతున్న మీరాబాయి చానుపై భారీ అంచ‌నాలున్నాయి. ఈసారి ఆమె స్వ‌ర్ణం సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మీరాబాయితో పాటు బింద్యారాని దేవి, గ్యానేశ్వ‌రీ యాద‌వ్‌ల నుంచి కూడా ప‌త‌కాలు ఆశించొచ్చు. 

ఇక బాక్సింగ్ విభాగంలో ల‌వ్లీనా బొర్గొహైన్‌, వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ జాన్మిన్ లంబోరియాతో పాటు సాక్షి చౌద‌రీ, ప్రీతి ప‌వార్‌ల‌పై భారీ అంచ‌నాలున్నాయి. జూడోలో తులికామ‌న్‌తో పాటు లాన్‌బౌల్స్‌లో బ‌రిలోకి దిగుతున్న జ‌ట్టుపై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. 2022 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో లాన్‌బౌల్స్‌లో  భారత్‌కు ఒక స్వ‌ర్ణం, వెండి ప‌త‌కం లభించింది. ఈసారి భార‌త్ లాన్స్‌బౌల్‌తోనే కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ను ఆరంభించనుంది.

👉2018 గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్‌లో భారత్ 66 పతకాలు (26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు) సాధించింది. 2022 బర్మింగ్‌హమ్ గేమ్స్‌లోనూ భారత్ 61 పతకాలతో సత్తా చాటింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.

👉 భారత్‌కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల టీ20 క్రికెట్, ట్రయాథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పతకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్‌లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ షెడ్యూల్‌
గురువారం, 23 జూలై
లాన్ బౌల్స్: పురుషుల‌, మ‌హిళ‌ల సింగిల్స్ గ్రూప్ ద‌శ (మధ్యాహ్నం 2:00 గంటల‌కు)

శుక్రవారం, 24 జూలై
లాన్ బౌల్స్: పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 1 గంటకు)
బాక్సింగ్: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ బౌట్స్ (రౌండ్ ఆఫ్ 32 / రౌండ్ ఆఫ్ 16)
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: సాయంత్రం 4:30 గంటలకు - పురుషుల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్
పారా పవర్‌లిఫ్టింగ్: పురుషుల & మహిళల లైట్‌వెయిట్ ఫైనల్స్ (సాయంత్రం 5:30 గంటలకు), పురుషుల & మహిళల హెవీవెయిట్ ఫైనల్స్ (రాత్రి 10:30 గంట‌ల‌కు)
స్విమ్మింగ్ / పారా స్విమ్మింగ్: పురుషుల S13 100మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 4x100మీ ఫ్రీస్టైల్ రిలే ఫైనల్ (రాత్రి 11:30 గంట‌ల‌కు )

శనివారం, 25 జూలై
లాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంటకు)
బాక్సింగ్: మొదటి రౌండ్ / రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు) 
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్ (సాయంత్రం 4:30 గంట‌ల‌కు) 
3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: భారత మహిళలు వ‌ర్సెస్ స్కాట్లాండ్ (గ్రూప్ స్టేజ్-రాత్రి 9:30 గంట‌ల‌కు)
స్విమ్మింగ్: పురుషుల S14 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 50మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (రాత్రి 11:30 గంట‌ల‌కు)

ఆదివారం, 26 జూలై
లాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 1:00 గంట‌కు)
వెయిట్ లిఫ్టింగ్: పురుషుల 60 కేజీల ఫైనల్ (మ‌ధ్యాహ్నం 2:00 గంట‌ల‌కు), మహిళల 48 కేజీల ఫైనల్ (సాయంత్రం 6.30 గంట‌ల‌కు), పురుషుల 65 కేజీల‌ ఫైనల్ (రాత్రి 11.00 గంట‌ల‌కు)
బాక్సింగ్: రెండవ రౌండ్ మ్యాచ్‌లు (మధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు)
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: పురుషుల వ్యక్తిగత 'ఆల్-రౌండ్' ఫైనల్ (సాయంత్రం 4:30 గంట‌ల‌కు), మహిళల వ్యక్తిగత 'ఆల్-అరౌండ్' ఫైనల్ (రాత్రి 10:30 గంట‌ల‌కు)

సోమవారం, 27 జూలై
లాన్ బౌల్స్: గ్రూప్ దశ (మధ్యాహ్నం 1:00 గంట‌కు); సెమీ-ఫైనల్స్ (రాత్రి 8:30 గంట‌ల‌కు)
అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు - పురుషుల 400మీ హర్డిల్స్ (రౌండ్ 1), లాంగ్ జంప్ (క్వాలిఫైయింగ్), పురుషుల 110మీ హర్డిల్స్ (రౌండ్ 1), రాత్రి 11:00 గంట‌ల‌కు - పురుషుల హై జంప్ ఫైనల్, 110మీ హర్డిల్స్ ఫైనల్, మహిళల షాట్ పుట్ F57 ఫైనల్
స్విమ్మింగ్: మధ్యాహ్నం 3:00 గంట‌ల‌కు - పురుషుల 200మీ బటర్‌ఫ్లై హీట్స్; రాత్రి 11:30 గంట‌ల‌కు - ఫైనల్
వెయిట్‌లిఫ్టింగ్: సాయంత్రం 5:30 గంట‌ల‌కు - మహిళల 53కిలోల & 58కిలోల విభాగాల ఫైనల్స్, పురుషుల 79కిలోల విభాగం ఫైనల్ (అర్ధరాత్రి 12:30)
3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్: రాత్రి 9:30 గంట‌ల‌కు - భారత్ మహిళల జట్టు vs నైజీరియా (గ్రూప్ దశ)

మంగళవారం, 28 జూలై
లాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంట‌కు - పతక పోరు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్), సాయంత్రం 7:30 గంట‌ల‌కు- పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ దశ
అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు - పురుషుల 400మీ రౌండ్ 1, రాత్రి 11:00 గంట‌ల‌కు - మహిళల హై జంప్ ఫైనల్, పురుషుల 100మీ సెమీ-ఫైనల్స్ & ఫైనల్స్
వెయిట్‌లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంట‌ల‌కు- మహిళల 63కిలోల విభాగం ఫైనల్; రాత్రి 11:00 గంటలకు - మహిళల 69 కేజీల ఫైనల్

బుధవారం, 29 జూలై
లాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల జంటలు & మహిళల సింగిల్స్ గ్రూప్ దశ
వెయిట్‌లిఫ్టింగ్: మధ్యాహ్నం 2:00 గంటలకు - మహిళల 77 కేజీల ఫైనల్; సాయంత్రం 6:30 గంటలకు - పురుషుల 94 కేజీల ఫైనల్
అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల షాట్‌పుట్ క్వాలిఫైయింగ్, పురుషుల 200 మీటర్ల రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు- పురుషుల లాంగ్ జంప్ ఫైనల్, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్

గురువారం, 30 జూలై
లాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ 
ట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 2:30 గంటలకు - క్వాలిఫైయింగ్ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- టీమ్ పర్స్యూట్ & టీమ్ స్ప్రింట్ ఫైనల్స్
అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్, పురుషుల డెకాథ్లాన్,  రాత్రి 11:00 గంటలకు - మహిళల డిస్కస్ త్రో ఫైనల్, మహిళల 5000మీ ఫైనల్, పురుషుల షాట్ పుట్ ఫైనల్
వెయిట్‌లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు - మహిళల +86 కేజీల ఫైనల్; రాత్రి 11:00 గంటలకు- పురుషుల +110 కేజీల ఫైనల్

శుక్రవారం, 31 జూలై
జూడో: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- ఫైనల్
బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - సెమీ-ఫైనల్ బౌట్‌లు
అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - మిక్స్‌డ్ 4x400మీ రిలే హీట్స్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, పురుషుల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 200మీ ఫైనల్

శనివారం, 1 ఆగస్టు
లాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - గ్రూప్ స్టేజ్ ; రాత్రి 9:00 గంటలకు-సెమీ-ఫైనల్స్
అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు- పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్, పురుషుల 400 మీటర్ల ఫైనల్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్, పురుషుల 5000 మీటర్ల ఫైనల్, మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే ఫైనల్
బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు& రాత్రి 9:00 గంటలకు - గోల్డ్ మెడల్ ఫైనల్స్
ట్రాక్ సైక్లింగ్: రాత్రి 7:30 గంటలకు- వ్య‌క్తిగ‌త‌ స్ప్రింట్ ఫైనల్ & 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ ఫైనల్

ఆదివారం, 2 ఆగస్టు
ట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 1:30 గంటలకు - 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ & 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్
జూడో: మధ్యాహ్నం 2:30 గంటలకు- హెవీవెయిట్ ప్రిలిమినరీ రౌండ్స్; సాయంత్రం 7:30 గంటలకు - పతకాల మ్యాచ్‌లు
ముగింపు వేడుకలు-రాత్రి 10.30 గంటల నుంచి

👉 భారత్‌లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌లన్నీ సోనీ నెట్‌వర్క్‌తో పాటు సోనిలివ్‌, దూరదర్శన్‌, డీడీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

2030లో భారత్‌ వేదికగా 
2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్‌ పతాకాన్ని భారత్‌కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్‌ చాటి చెప్పనుంది. దీంట్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్‌ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement