చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు తొలి రోజు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్... మహిళల సింగిల్స్‌లో దేవిక సిహాగ్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. థాయ్‌లాండ్ ఓపెన్ చాంపియన్ దేవిక 19–21, 21–19, 13–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ 10–21, 14–21తో లియోంగ్ జున్ హావో (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.
నేడు మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ పీవీ సింధు భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో యుషి తనాకా (జపాన్)తో లక్ష్య సేన్; అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా)లతో గద్దె రుత్విక శివాని–రోహన్ ... గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా)లతో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల పోటీపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా)లతో హరిహరన్–అర్జున్ ఆడతారు.


