Photo Credit: BCCI Twitter
ఇంగ్లండ్‌తో ఆదివారం జరగనున్న వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరిదని, ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని, జట్టులో కొనసాగినంతకాలం రోహిత్ శర్మ టీమిండియాకు ఆడుతాడని, అతడి రిటైర్మెంట్ ఇప్పుడే ఉండదని పేర్కొంటూ ఊహాగానాలకు తెరదించాడు.
అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై భారత దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలికినా అతడి రిటైర్మెంట్‌ను ఒక వేడుకలా సెలబ్రేట్ చేయాలని బీసీసీఐకి సూచించారు. 19 ఏళ్ల కెరీర్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్న రోహిత్ శర్మకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముందన్నారు.
రిటైర్మెంట్ అనేది క్రికెటర్లకు కామన్ అని, దాని గురించి బాధపడొద్దని, ఆ ప్రక్రియను ఒక వేడుకలా జరుపుకోవాలని కపిల్ హితవు పలికారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్ అనే పదం వినగానే ఎందుకు బాధపడాలి. సమయం వచ్చింది కాబట్టే అంతా రోహిత్ వీడ్కోలు గురించి మాట్లాడుకుంటున్నారు. 19 ఏళ్లుగా రోహిత్ తన ఆటతో ఎంతో సంతోషాన్ని పంచాడు. ఏదోఒక రోజు అందరూ రిటైర్ అవ్వాల్సిందే.
నాతో పాటు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇలా అందరం ఆటకు వీడ్కోలు పలికినవాళ్లమే. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్‌కు సమయం వచ్చినప్పుడు మనమంతా దానిని ఒక వేడుకగా జరుపుకోవాలి. రోహిత్ వీడ్కోలు ఎప్పుడు పలికినా ఆ మ్యాచ్‌లో మాత్రం సెంచరీ సాధించాలని బలంగా కోరుకుంటున్నా.’ అని కపిల్ దేవ్ తెలిపారు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన రెండు వన్డేలు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. అంతకముందు అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా 16, 48, 79 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి.
Greater Noida, Uttar Pradesh: When asked about speculation that this match at Lord's could be Rohit Sharma's last ODI, Former Indian cricket team captain and President of PGTI, Kapil Dev says, "... He has entertained the nation immensely, something very few players have… pic.twitter.com/ytrOdnUipk
— IANS (@ians_india) July 18, 2026


