ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి | Actress Aanchal Singh Engagement | Sakshi
Sakshi News home page

Aanchal Singh: వెబ్ సిరీస్‌లతో ఫేమ్.. ఇప్పుడు వివాహ బంధంలోకి

Jul 17 2026 12:51 PM | Updated on Jul 17 2026 1:16 PM

Actress Aanchal Singh Engagement

యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్‌ల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆంచల్ సింగ్.. గత కొన్నేళ్లుగా మోహిత్ చావ్లా అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. తాజాగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఢిల్లీలో పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలని ఆంచల్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జోడీ)

కొన్నేళ్లు కలిసి జర్నీ చేసిన తర్వాత జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలనే నిర్ణయం సహజంగా వస్తుంది. మా ప్రపోజల్ కూడా ఎంతో అందంగా జరిగింది. కానీ అది నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే మా బంధంలో ప్రతి చిన్న అనుభవం, ప్రతి జ్ఞాపకాన్ని దాటుకుని ఈ దశ వరకు వచ్చాం. అదే నాకు గొప్ప సర్‌ప్రైజ్ కంటే ఎక్కువ రొమాంటిక్‌గా అనిపించింది అని ఆంచల్ చెప్పింది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని ఆంచల్ చెప్పింది.

పంజాబీ నటి అయిన ఆంచల్.. 2012 నుంచి ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతోంది. తొలుత ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఈమె.. 2013లో వచ్చిన ఓ సింహళ మూవీతో నటిగా మారింది. ఆపై రామయ్య వస్తావయ్యా, హాలీడే, జాక్సన్ దురై, దిళ్లుకు దుడ్డు, పుంజ్ ఖాబ్, బాంబ్ జిగ్రా, జక్మీ లాంటి హిందీ, తమిళ, పంజాబీ సినిమాలు చేసింది. కానీ ఓటీటీలో చేసిన యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్‌లు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంతకు సీమంతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement