మరదలిపై బావ దాడి.. అడ్డొచ్చిన అత్తను నరికి చంపాడు..! | Tamil Nadu Horror, Man Kills Aunt And Injures Cousin After She Refuses To Marry Him, More Details Inside | Sakshi
Sakshi News home page

మరదలిపై బావ దాడి.. అడ్డొచ్చిన అత్తను నరికి చంపాడు..!

Jul 16 2026 10:02 AM | Updated on Jul 16 2026 11:18 AM

mother and daughter in TN after engagement was called off

మరదలిపై కొడవలితో విచక్షణారహితంగా దాడి 

డ్డువచ్చిన అత్తను హత్య చేసిన యువకుడు.. 

తమిళనాడులో ఘటన  

 సాక్షి, చెన్నై: నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కోపంతో మరదలిపై ఓ యువకుడు కొడవలితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా అత్తపై కూడా విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో యువతి తల్లి ప్రాణాలు కోల్పోగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కరియాపట్టి తాలూకా కల్కురిచి గ్రామానికి చెందిన ముత్తుకుమార్, వినాయకజ్యోతి(45) దంపతులకు వర్ష(21) అనే కుమార్తె ఉంది. 

ముత్తుకుమార్‌ సోదరి కుమారుడు యువరాజన్‌(32)తో ఆమెకు వివాహం చేసేందుకు నిశి్చతార్థం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి వర్ష నిరాకరించడంతో వివాదం మొదలైంది. బుధవారం ఉదయం తీవ్ర ఆగ్రహానికి గురైన యువరాజన్‌.. ముత్తుకుమార్‌ ఇంటికి వచ్చి వర్షతో గొడవకు దిగాడు. కోపం పట్టలేక తన వెంట తెచ్చుకున్న కొడవలితో వర్షపై దాడి చేశాడు. 

అదే సమయంలో కుమార్తెను రక్షించేందుకు వినాయకజ్యోతి అడ్డువెళ్లింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువరాజన్‌.. వినాయకజ్యోతిని దారుణంగా నరికేశాడు. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో.. అతను పారిపోయాడు. ఘటనాస్థలంలోనే వినాయక జ్యోతి మరణించగా.. తీవ్ర గాయాలపాలైన వర్షను ఆస్పత్రికి తరలించారు. యువరాజన్‌ బుధవారం సాయంత్రం మల్లంగి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.  

అత్తను, మరదలి  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement