8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..! | 8 Months Pregnant Woman Incident | Sakshi
Sakshi News home page

8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..!

Jul 11 2026 12:44 PM | Updated on Jul 11 2026 12:48 PM

8 Months Pregnant Woman Incident

ఏఐ ఫోటో

కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకున్న భర్త 8 నెలల కడుపుతో ఉన్న భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన చిక్కబాణావర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హెసరఘట్ట రోడ్డులో చోటు చేసుకుంది. మహమ్మద్‌ పీర్‌(40) అనే వ్యక్తి తన భార్య హసీనా(35)పై హత్యాయత్నం చేశాడు. 

వివరాలు.. మహమ్మద్‌ పీర్, హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంతకు ముందే మహమ్మద్‌ పీర్‌కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. ఈక్రమంలో హసీనా రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్‌ చేయించాడు. మళ్లీ ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించుకోవడానికి హసీనా ఒప్పుకోలేదు. మహమ్మద్‌ పీర్‌ ఆమెపై దాడి చేసి అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి చేసినా హసీనా ససేమిరా అంది.

 గురువారం సాయంత్రం హసీనా ఇంట్లో నిద్రిస్తుండగా చున్నీ(వేల్‌)తో గొంతు బిగించి హత్యాయత్నం చేశాడు. పెనుగులాటలో హసీనా మూర్ఛబోవడంతో మృతి చెందిందని భావించి పరారయ్యాడు. అయితే హసీనాకు స్పృహ వచ్చాక పుట్టింటికి ఫోన్‌ చేసి జరిగిన సంగతి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే హసీనాను వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు గాలించి నిందితుడిని అరెస్టు చేశారు.

కర్ణాటక: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement