ఏయ్‌ ఉండమ్మా.. మహిళపై చంద్రబాబు ఆగ్రహం | Chandrababu Angry On Woman At Banaganapalle Meeting | Sakshi
Sakshi News home page

ఏయ్‌ ఉండమ్మా.. మహిళపై చంద్రబాబు ఆగ్రహం

Jul 9 2026 4:37 PM | Updated on Jul 9 2026 5:05 PM

Chandrababu Angry On Woman At Banaganapalle Meeting

సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లెలోని మీ భూమి-మీ హక్కు సభలో ఓ మహిళపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించిన మహిళపై చంద్రబాబు మండిపడ్డారు. ఏయ్‌ ఉండమ్మా.. అంటూ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఇది పవిత్ర కార్యక్రమం అంటూనే సమస్య  వినకుండా చంద్రబాబు దాటవేశారు.

మహిళను అడ్డుకోలేదని పోలీసులపై కూడా చంద్రబాబు చిందులు తొక్కారు. ఏయ్‌ గీయ్‌ అంటూ కాసేపు హడావుడి చేసిన చంద్రబాబు తీరుపట్ల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలుసార్లు చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారని  ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

2018లో సచివాలయం బయట నాయీ బ్రాహ్మణులతో చంద్రబాబు ఇలానే బిహేవ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్‌ చేస్తా. బీ కేర్‌పుల్‌. బెదిరిస్తే తోక కట్‌ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్‌గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ అంటూ బెదిరింపులకు దిగారు. చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతూ.. వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నాయీ బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. అప్పటి ఘటనను కూడా గుర్తు చేస్తూ.. సోషల్‌ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement