banaganapalle
-
మహిళా బెనిఫిషరీ మాటలకు జగన్ ఫిదా...
-
Watch: బనగానపల్లెలో బాబు, పవన్‌లపై సీఎం జగన్ పంచులు
-
కొలిమిగుండ్ల మండలంలో టీడీపీకి భారీ షాక్
-
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీకి షాక్
-
వెంగమ్మ పేణీలు.. రుచి మామూలుగా ఉండదు!
సాక్షి, కర్నూలు: బంగినపల్లి మామిడికే కాదు నోరురించే పేణీలకు కూడా ఫేమస్ బనగానపల్లె. అందులోనూ వెంగమ్మ పేణీలు అంటే కర్నూలు జిల్లా నలుమూలల్లో తెలియని వారుండరు. ఎంతో రుచికరంగా ఉండే ఈ మిఠాయిని చిన్నా పెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుని తింటారు. అంతలా ప్రాచూర్యం పొందిన ఈ పేణీల తయారీని 1940వ సంవత్సరంలో సన్నుధి వెంగమ్మ అనే మహిళ ప్రారంభించారు. అమ్మకానికి ఉంచిన పేణీలు ఈ పేణీలు రుచిగా ఉండటంతో క్రమంగా వెంగమ్మ పేణీలుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఆ తరువాత కొన్నేళ్లకు ఆమె దివంగతులయ్యారు. ఆ తరువాత ఆమె వారసులు పేణీలు తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మొదట్లో తక్కువ ధరకే విక్రయించినా ప్రస్తుతం సరుకుల ధరలు పెరగడంతో పేణీలు కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు. నేడు సుమారు 10 కుటుంబాలు బనగానపల్లెలో పేణీలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. ప్రతి రోజు 350–400 కిలోల వరకు పేణీల తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. తయారు చేయడం ఇలా .. 10 కిలోలు పేణీలు తయారు చేయాలంటే మూడు కిలోల గోధుమ పిండి, ఆర కిలో మైదా, ఐదు కిలోల చక్కెర, రెండు కిలోల నెయ్యి లేదా డాల్డా వినియోగిస్తారు. గోధుమ పిండి, మైదాను నీటితో తడిపి రెండు గంటల పాటు ఉంచి ఆ తరువాత ముద్దగా చేస్తారు. తరువాత అవసరమైన మేర చిన్న చిన్న ఉండలు తయారు చేసి వాటిని రేకులుగా మార్చి ఫోల్డింగ్ చేస్తారు. పెనంలో నెయ్యి లేదా డాల్డా బాగా మరుగుతున్న సమయంలో అందులో వేస్తారు. బాగా కాలిన తరువాత వాటిని బయటకు తీస్తారు. కొంత సేపు తరువాత మళ్లీ చక్కెర పాకంలో 10 నిమిషాల పాటు ఉంచుతారు. దీంతో పేణీలు చూడగానే నోరూరించేలా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. 10 కేజీల పేణీలు తయారీకి మొత్తం ఖర్చు సుమారు రూ 1400–1500లు అవుతుందని విక్రయిస్తే రూ.2 వేలు వస్తుందని వెంగమ్మ వారసులు తెలిపారు. బనగానపల్లె పట్టణంలో ఒక్కొక్క కుటుంబం రోజుకు 30–35 కిలోలు తయారు చేసి విక్రయిస్తున్నారు. శుభకార్యాల సమయంలో కొనుగోలు మరింత ఎక్కువగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. చదవండి: కోడి పందేలను అడ్డుకుంటున్నాం -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వర్చువల్ ద్వారా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. జనార్ధన్‌రెడ్డికి14 రోజుల రిమాండ్ విధిస్తూ కర్నూలు సబ్‌జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడైన జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: Munna Gang: హైవే కిల్లర్‌తో పాటు 10 మందికి ఉరిశిక్ష -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, కర్నూలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
దారుణం: ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు
సాక్షి, బనగానపల్లె(కర్నూల్): పెంచిన మమకారాన్ని మరచి, ఆస్తి కోసం తల్లినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణం బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో గురువారం వెలుగు చూసింది. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు..నార్పరెడ్డిగారి పుల్లమ్మ(58)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఈమె భర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పుల్లమ్మ పెంచి, పోషించి..వివాహం చేసింది. వృద్ధాప్యంలో కుమారుడు ప్రసాద్ రెడ్డి వద్ద ఉంటోంది. తల్లి పేరున ఉన్న పొలంలో మూడు ఎకరాలను ఇటీవల ప్రసాద్ రెడ్డి ఎకరా రూ.35 లక్షల చొప్పున విక్రయించాడు. వచ్చిన డబ్బుతో నిత్యం మద్యం తాగేవాడు. ఆస్తంతా తన పేరున రాయాలని తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. ప్రసాద్ రెడ్డి భార్య అపర్ణ కాన్పుకోసం ఇటీవల పుట్టినిల్లు అయిన అవుకు మండలం మెట్టుపల్లెకు వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం తలుపు వేసి తల్లి పుల్లమ్మను దారుణంగా కత్తితో పొడిచాడు. తల్లి మృతి చెందడంతో ఇంటికి తలుపు వేసి పరారయ్యాడు. ప్రసాదరెడ్డి కోసం గురువారం బనగానపల్లె నుంచి మిట్టపల్లెకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటి తలుపు తట్టి చూడగా.. పుల్లమ్మ రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగు పొరుగు వారికి తెలియజేయగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేష్ కుమార్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రసాదరెడ్డి తనకు ఏమీ తెలియనట్లు ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆయనను ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. -
బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని
సాక్షి, కర్నూలు : బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి ఏరియా ఆసుపత్రిగా మారుస్తున్నట్టు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధులు రూ. 15 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్షన్నర లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆసుపత్రిగా తీర్చిదిద్దే క్రమంలో సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున కాటసాని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య
చుట్టూ అడవి..ఎర్రటి కొండలు..పచ్చటి పరిసరాలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్థ్యం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే యాగంటి క్షేత్రంపై ప్రత్యేక కథనం. సాక్షి, బనగానపల్లె(కర్నూలు): యాగంటి క్షేత్ర ఉనికి పురాణకాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని, ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువైయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట. ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘‘నేకంటి నేకంటì ’’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్థావన చేశారు. అగస్త్యుని ఆలయం యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమిషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శేవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహలయాల్లో ఒక దానిలో శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటనవేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు. హరిహరరాయల కాలం నాటి క్షేత్రం ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది ఖచ్చితంగా తెలియకపోయినా హరిహరాయిలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది. (అలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండధారతో నిండే ఈ కోనేరులో స్నాం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్ఞాత కొండధారతో వచ్చే నీటిని ‘‘అగస్త్య పుష్కరిణి’’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు. శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకానొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తేంటే కాకాసురడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించిన్నట్లు ప్రతీతి. ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కానరావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది. దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య యాగంటి క్షేత్రం బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువైన్నారు. కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్టించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. ఒకే శిలపై ఉమామహేశ్వరులు వసతి ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం, రెడ్ల, వాసవి ఆర్యవైశ్య, వేదగాయత్రి బ్రాహ్మణ తదితర వసతి గృహాలు ఉన్నాయి. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది. -
కర్నూలు జిల్లాలో భారీగా వర్షాల ప్రభావం
-
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి
-
బతుకు బాటలో మృత్యుగూటికి
- ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం - నందివర్గం సమీపంలో ఘటన బనగానపల్లె రూరల్ : కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్లిన ఓ యువకున్ని మృత్యువు ట్రాక్టర్ ప్రమాదం రూపంలో పొట్టనపెట్టుకుంది. బాధిత కుటుంబీకులకు తీరని రోదన మిగిల్చింది. నందివర్గం సమీపంలో గురువారం జరిగిన ఈ ఘటనలో ఎస్.సురేష్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఏఎస్ఐ చంద్రశేఖర్, కుటుంబ సభ్యుల వివరాల మేరకు బీరవోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బాలహుస్సేనమ్మ దంపతులకు సురేష్, సంతోష్ కుమారులు. సురేష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన బాషా ట్రాక్టర్‌కు నాపరాయి లోడింగ్ పనులకు వెళ్లారు. పలుకూరు గనిలో నాపరాయి గద్దెలను లోడ్ చేసుకుని బండి ఆత్మకూరు గ్రామానికి బయలుదేరారు. నందివర్గం సమీపానికి రాగానే ట్రాక్టర్ డ్రైవర్ సడన్‌బ్రేకులు వేయడంతో ట్రాలీ బోల్తా పడింది. ఘటనలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సురేష్‌పై రాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. బాషాకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు.. మృతి చెందిన సురేష్ నేత్రాలను ఆయన తల్లిదండ్ల్రులు దానం చేశారు. నంద్యాల శాంతిరామ్ వైద్యశాల కంటివైద్యులు బాధిత కుటుంబీకుల నుంచి మృతుడి నేత్రాలను స్వీకరించారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్
– విలువైన డాక్యుమెంట్స్, పత్రాలు దగ్ధం బనగానపల్లె: బనగానపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్ జరిగింది. ఈ ఘటనలో విలువైన డాక్యుమెంట్స్, రికార్డులు కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లోపలి భాగం నుంచి మంటలురేగి పొగ బయటకు వ్యాపించింది. ఇరుగుపొరుగువారు దీన్ని గమనించి వెంటనే కార్యాలయ సిబ్బందికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందించారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.అయితే, అప్పటికే కార్యాలయంలోని డాక్యుమెంట్లు, చలానాలు, ఈసీలు, నకలు, అకౌంట్స్ ఏ,డీఫారాలతో పాటు కొన్ని విలువైన పత్రాలు కాలిబూడిదైనట్లు కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యాలయ భవనం పురాతనమైనది కావడంతో పాటు అందులో విద్యుత్ వైరింగ్ సక్రమంగా లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు. షార్ట్సరూ్క్యట్ విషయం తెలుసుకున్న జిల్లా సబ్‌రిజిస్ట్రార్ నీలకంఠం బనగానపల్లెకు చేరుకుని అగ్నికి ఆహుతైన వాటిని పరిశీలించారు. -
జిల్లాకు ఏసీ బస్సులు
బనగానపల్లె : జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన రూట్లల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం ఏసీ బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. బనగానపల్లె డిపో ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్–బెంగళూరు, కర్నూలు– బెంగళూరు, నంద్యాల– బెంగళూరు, డోన్– విజయవాడ, శ్రీశైలం– బెంగళూరు సర్వీసులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతిరాగానే ఏసీ బస్సులు నడుపుతామన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు జిల్లాలో ఆర్టీసీకి రూ.45కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇందులో బనగానపల్లె డిపో నష్టం రూ.4.5కోట్ల వరకు ఉందన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోకు 3 కొత్త బస్సులు పంపామని, మరిన్ని బస్సులను కూడా పంపుతామని తెలిపారు. అంతకుముందు ఆర్ఎం డిపో మేనేజర్ శశిభూషణ్‌తో కలిసి బస్టాండ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న దుకాణాల సముదాయం, బస్టాండ్‌లో వసతులను పరిశీలించారు. గ్యారేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు. -
ఎస్ఆర్బీసీలో గుర్తు తెలియని మృతదేహం
బనగానపల్లె రూరల్: రవ్వల కొండ సమీపంలోని ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కనిపించింది. నీటి ప్రవహంలో కొట్టుకొచ్చి ముళ్లకంపల వద్ద అగింది. మృతిని వయసు 35–40 సంవత్సరాలు ఉంటుంది. నలుపు రంగు ప్యాంట్, తెలుపు, నలుపు, బిస్కెట్ రంగు కలిగిన చొక్కొతో పాటు బనియన్ ధరించి ఉన్నాడు. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారన్నారన అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని బనగానపల్లె ఎస్ఐ సీఎం రాకేష్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి
కర్నూలు (బనగానపల్లె) : కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో గురువారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన బనగానపల్లెలో ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భార్య వెంకటలక్ష్మి(50) మృతిచెందగా, భర్త రామచంద్రారెడ్డి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబకలహాలతోనే ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
220 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
బనగానిపల్లె (కర్నూలు): అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బనగానిపల్లె సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బనగానిపల్లె శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్న లారీ పట్టుబడింది. అందులో 220 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పట్టణానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యాపారిపై కేసు నమోదు చేసి, లారీని, బియ్యాన్ని సీజ్ చేశారు. -
తప్పిన ప్రమాదం
బనగానపల్లె: శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్సార్బీసీ)కు బనగానపల్లె సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ గండి పడింది. దీంతో 1500 క్యూసెక్కుల నీరు సోమలవాగులోకి చేరింది. ఒక్కసారిగా ఇంత నీరు రావడంతో సోమలవాగు పొంగి నంద్యాల- బనగానపల్లె రోడ్డులో కాజ్‌వేపైకి ఎక్కి ప్రవహించింది. తెల్లవారుజామున విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ హైటెక్ బస్సు డ్రైవర్ వాగులో నుంచి వెళ్లవచ్చని భావించి, ముందుకు పోనిచ్చారు. అయితే కొంత దూరం వెళ్లగానే ఇంజన్‌లోకి నీరు చేరడంతో బస్సు ఆగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే వెనుక వాగు బయటే ఉన్న బస్సులోని ప్రయాణికులు స్థానికులను అప్రమత్తం చేశారు. ట్రాక్టర్‌ను తెప్పించి, బస్సు వద్దకు పంపారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు బస్సు వెనుక అద్దం పగులగొట్టి ట్రాక్టర్లోకి దూకి సురక్షితంగా బయటపడ్డారు. సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ప్రవాహం తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగాయి. కర్నూలు-వైఎస్సార్ కడప జిల్లాల్లోని 1.90 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్సార్బీసీకి గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ గండి పూడ్చడానికి సుమారు నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతుండడంతో ఆయకట్టుకు సాగునీరందక ఇబ్బందిపడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అదికారుల పరిశీలన గండి పడిన ప్రాంతాన్ని ఎస్సార్బీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ, ఈఈ మక్బుల్ అహ్మద్, డీఈఈ కృష్ణమూర్తి,ఏఈ మస్తాన్‌తోపాటు నంద్యాల ఆర్డీవో నరసింహులు, తహశీల్దార్ శేషఫణి, ఏఎస్ఓ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో గండిని పూడ్చివేస్తామని ఎస్ఈ పేర్కొన్నారు. -
475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత
బనగానపల్లె, న్యూస్‌లైన్:అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర రైస్ మిల్లు యజమాని శ్రీనివాసులు టర్బో వాహనంలో 210 క్వింటాళ్లు, డీసీఎం వాహనంలో 80 క్వింటాళ్ల బియ్యాన్ని కర్ణాటకలోని తుమ్ముకూరు, బంగారుపేటకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వాహనాలు రైస్ మిల్లు నుంచి బయలుదేరగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐలు పవన్‌కిషోర్, శ్రీనివాసులు, వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, నజీర్, శివ ఆకస్మిక దాడి చేసి యాగంటిపల్లె వద్ద వాహనాలను అడ్డుకున్నారు. రెండు వాహనాల్లోని సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. అనంతరం యోగీశ్వర రైస్‌మిల్లులో తనిఖీలు చేయగా అక్కడ కూడా 185 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. రూ. 10 లక్షల విలువైన 475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ రేషన్‌కార్డుల ద్వారా పంపిణీ చేసే కిలో రూపాయ బియ్యం అక్రమంగా ఎలా తరులుతున్నాయని, అందుకు బాధ్యులు ఎవరన్న విషయం దర్యాప్తులో వెలుగు చూస్తుందన్నారు. -
బైక్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం
బనగానపల్లె, న్యూస్‌లైన్ : టంగుటూరు సమీపంలో గురువారం ఉదయం బైక్ అదుపు తప్పడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి దుర్మణం పాలయ్యాడు. వివరాలు.. అవుకు గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్(19) బనగానపల్లె కె.జి.ఆర్ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు తన స్నేహితుడు హరిష్గౌడ్తో కలిసి గురువారం నంద్యాల వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ప్రమాదంలో శ్యాంప్రసాద్ తల రాయికి బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున హరిష్‌గౌడ్ ఎలాంటి గాయాలు కూడా లేకుండా బయటపడ్డాడు. శ్యాంప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆసుపత్రికి త రలించారు. కేసు నమోదు చేసినట్లు నందివర్గం ఎస్ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు. -
తెలుగు ప్రజలను చీలిస్తే ఊరుకోం
బనగానపల్లె, న్యూస్‌లైన్: ఒకే భాష మాట్లాడుతూ.. సమైక్యంగా ఉంటున్న తెలుగు ప్రజలను చీలిస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి రామిరెడ్డికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సమ న్యాయం చేయాలనే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కోరుతుందన్నారు. విభజనకు మొదటి ముద్దాయి చంద్రబాబు అయితే.. రెండో ముద్దాయి సోనియాగాంధీయేనన్నారు. ఇటలీ దేశానికి చెందిన సోనియా సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోలేక విభజనకు సిద్ధపడ్డారన్నారు. సమైక్యాంధ్రను రెండుగా చీల్చడాన్ని ప్రజలెవరూ కోరుకోవడం లేదన్నారు. చంద్రబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం అయినా.. ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండటం వల్లే తెలంగాణకు మద్దతు పలుకుతున్నాడని విమర్శించారు. సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ నాయకులు రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉన్నట్లయితే ముందుగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను పక్కన పెట్టిన బాబు.. అధికార కాంగ్రెస్‌తో చెట్టాపెట్టాలేసుకు తిరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారి చేతిలోని ఓటు అనే వజ్రాయుధంతో ఆయనతో పాటు పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం సాగిస్తున్న పార్టీ ఒక్క వైఎస్‌ఆర్‌సీపీయేనని.. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీ నాయకులు హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని వీడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రామిరెడ్డిని సీమాంధ్రలోని ఆ పార్టీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దీక్షా శిబిరాన్ని కాటసాని సతీమణి జయమ్మతో పాటు కూతురు ప్రతిభ, అల్లుడు బ్రహ్మానందరెడ్డి తదితరులు సందర్శించారు.