475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత | 475 subsidized rice Capture | Sakshi
Sakshi News home page

475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత

Sep 30 2013 2:04 AM | Updated on Sep 1 2017 11:10 PM

అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర

బనగానపల్లె, న్యూస్‌లైన్:అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర రైస్ మిల్లు యజమాని శ్రీనివాసులు టర్బో వాహనంలో 210 క్వింటాళ్లు, డీసీఎం వాహనంలో 80 క్వింటాళ్ల బియ్యాన్ని కర్ణాటకలోని తుమ్ముకూరు, బంగారుపేటకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వాహనాలు రైస్ మిల్లు నుంచి బయలుదేరగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐలు పవన్‌కిషోర్, శ్రీనివాసులు, వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, నజీర్, శివ ఆకస్మిక దాడి చేసి యాగంటిపల్లె వద్ద వాహనాలను అడ్డుకున్నారు.
 
 రెండు వాహనాల్లోని సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. అనంతరం యోగీశ్వర రైస్‌మిల్లులో తనిఖీలు చేయగా అక్కడ కూడా 185 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. రూ. 10 లక్షల విలువైన 475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.  ప్రభుత్వ రేషన్‌కార్డుల ద్వారా పంపిణీ చేసే కిలో రూపాయ బియ్యం అక్రమంగా ఎలా తరులుతున్నాయని, అందుకు బాధ్యులు ఎవరన్న విషయం దర్యాప్తులో వెలుగు చూస్తుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement