టంగుటూరు సమీపంలో గురువారం ఉదయం బైక్ అదుపు తప్పడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి దుర్మణం పాలయ్యాడు.
బైక్ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దుర్మరణం
Sep 20 2013 2:25 AM | Updated on Sep 1 2017 10:51 PM
బనగానపల్లె, న్యూస్‌లైన్ : టంగుటూరు సమీపంలో గురువారం ఉదయం బైక్ అదుపు తప్పడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి దుర్మణం పాలయ్యాడు. వివరాలు.. అవుకు గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్(19) బనగానపల్లె కె.జి.ఆర్ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు తన స్నేహితుడు హరిష్‌గౌడ్‌తో కలిసి గురువారం నంద్యాల వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ప్రమాదంలో శ్యాంప్రసాద్ తల రాయికి బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున హరిష్‌గౌడ్ ఎలాంటి గాయాలు కూడా లేకుండా బయటపడ్డాడు. శ్యాంప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆసుపత్రికి త రలించారు. కేసు నమోదు చేసినట్లు నందివర్గం ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement


