220 క్వింటాళ్ల బియ్యం పట్టివేత | 220 quintels rice captured | Sakshi
Sakshi News home page

220 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

Sep 3 2015 8:58 PM | Updated on Sep 3 2017 8:41 AM

అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

బనగానిపల్లె (కర్నూలు): అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షల విలువైన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బనగానిపల్లె సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బనగానిపల్లె శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్న లారీ పట్టుబడింది. అందులో 220 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పట్టణానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యాపారిపై కేసు నమోదు చేసి, లారీని, బియ్యాన్ని సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement