టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ | Former Tdp Mla Bc Janardhan Reddy Magistrate Virtual Remand Kurnool | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

May 24 2021 8:43 PM | Updated on May 24 2021 8:54 PM

Former Tdp Mla Bc Janardhan Reddy Magistrate Virtual Remand Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వర్చువల్ ద్వారా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. జనార్ధన్‌రెడ్డికి14 రోజుల రిమాండ్‌ విధిస్తూ కర్నూలు సబ్‌జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా బనగానపల్లె పాత బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడైన జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చదవండి: Munna Gang: హైవే కిల్లర్‌తో పాటు 10 మందికి ఉరిశిక్ష

Advertisement
 
Advertisement
Advertisement