కృష్ణాజిల్లా: గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా మానసికంగా, లైంగికంగా తన ఇంటికి రావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 17న ఆమె తండ్రి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అయితే ఫిర్యాదు అనంతరం ఆమెను అధికారం అండతో బంటుమిల్లికి బదిలీ చేయించిట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు కోరారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ అన్నారు. ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


