సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత మార్గాని భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి 36వ డివిజన్‌లో టీడీపీ నుంచి పలువురు కార్యకర్తలను వైఎస్సార్‌సీపీలో చేర్చుకునే కార్యక్రమానికి భరత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వస్తున్న భరత్, మాజీ ఎంపీ సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భరత్ అరెస్ట్‌తో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజమండ్రి 36వ డివిజన్‌లో ఉద్రిక్తత కొనసాగింది.


