సాక్షి, అమరావతి: ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్ వర్క్ కలకలం రేగింది. ఆపరేషన్ ఫైర్‌వాల్‌తో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం అయ్యింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ జరిపిన దాడుల్లో మెుత్తం 18 మందిని గుర్తించగా వారిలో 13 మంది నేవి సిబ్బంది అనుమానితులుగా గుర్తించారు. 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలతో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు జరిపారు.
ఈ సోదాలలో ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా పాకిస్థాన్ కౌంటర్ ఇంటిలిజెన్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. భారత్ కు చెందిన రహస్య సమాచారాన్నిసేకరించి పాక్ ఆపరేటివ్ కు చేరవేసినట్లు సమాచారం. నేవీ, రక్షణ సంస్థల సమచారమే టార్గెట్‌గా గూఢచర్యం చేసినట్లు తెలుస్తోంది.. అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ,కేరళ, మహారాష్ట్ర సహా 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మెుత్తం ఇద్దరిని కౌంటర్ ఇంటిలిజెన్స్ సభ్యులు అరెస్ట్ చేశారు. మెుత్తం 18 మందిలో ఇద్దరి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించగా మిగతా 16 మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండీ: ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా?


