గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయన చొరవతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు విశేష సేవలందించాం. మా జీతాలు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని తొలగించి మోసం చేశారు. ఉపాధి కోల్పోయాం. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. కానీ, సొంత డప్పు కొట్టుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రం ప్రభుత్వ సొమ్ము దుబారాగా ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు.
– ఆలపాటి జ్యోతి, మాజీ వలంటీర్, ఆత్రేయపురం
చంద్రబాబు మోసానికి పవన్ కల్యాణ్ వంత
వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.5 వేలకు బదులుగా రూ.10 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. ‘మేం ఒకరి పొట్ట కొట్టం.. వలంటీర్లకు, అక్కచెల్లెమ్మలకు రూ.10 వేలు ఇస్తామంటూ ఆయనకు పవన్ కల్యాణ్ కూడా లక్షల మంది ప్రజల ముందు వంత పాడారు. బహిరంగ సభల్లో అంత గొప్పగా చెప్పిన మాటలు నేడు అస్సలు గుర్తు లేవన్నట్లుగా ప్రవర్తించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ ఇద్దరికీ లక్షలాది వలంటీర్ల ఉసురు తప్పకుండా తగులుతుంది.
– సాదే రాజేష్, మాజీ వలంటీర్, జగన్నాయకులపాలెం, రామచంద్రపురం మండలం


