అర్హుల పెన్షన్లు రద్దు చేయించడం దారుణం | - | Sakshi
Sakshi News home page

అర్హుల పెన్షన్లు రద్దు చేయించడం దారుణం

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

● ఎమ్మెల్యే నల్లమిల్లి తీరు సరికాదు

● మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌

సత్తి సూర్యనారాయణరెడ్డి

అనపర్తి: అర్హుల పింఛన్లను రద్దు చేయించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీరు దారుణమని వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినటర్‌, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సేవలు చేయించుకుని, గెలిచిన తర్వాత వదిలేసే చరిత్ర ఎమ్మెల్యే నల్లమిల్లిదన్నారు. గడిచిన ఎన్నికలలో ఈవీఎంల సహకారం, అబద్ధపు వాగ్దానాలు, జనసేన పార్టీ మద్దతుతోనే ఆయన గెలిచారనేది బహిరంగ సత్యమన్నారు. గతంలో టీడీపీ నాయకుల అక్రమాలపై ఫిర్యాదు చేసిన బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామానికి చెందిన జనసేన వార్డు మెంబర్‌పై కక్ష పెట్టుకున్న రామకృష్ణారెడ్డి.. గెలిచిన అనంతరం ఆ జనసేన నాయకుడి భార్య, దృష్టిలోపం ఉన్న వికలాంగురాలైన కొర్ల రాము పెన్షన్‌ రద్దు చేయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి వెరిఫికేషన్‌ పేరిట ఆవిడకు పెన్షన్‌ రాకుండా చేశారని, సదరు బాధితులు పవన్‌ కళ్యాణ్‌ ఆఫీస్‌కు వెళ్లినా కూడా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లతో అన్యాయం జరిగిందన్నారు. అదే గ్రామంలో పింఛన్లు తీసుకుంటున్న 17 మందిని అనర్హులుగా పేర్కొంటూ రద్దు చేయాలని డీఆర్‌డీఏ డైరెక్టర్‌కు లేక రాయడం ఆయన కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆ 17 మందిలో ఎక్కువమంది జనసేన కార్యకర్తలతో పాటు, కొందరు టీడీపీ, వైఎస్సార్‌ీ సపీ మద్దతుదారులు కూడా ఉన్నారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు, పింఛన్లు అందజేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement