ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు

Oct 7 2026 12:11 AM | Updated on Oct 7 2026 12:11 AM

రాజమహేంద్రవరం సిటీ: త్వరలో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగర పరిధిలో భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్‌ నియంత్రణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను పటిష్టంగా చేపట్టాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ సూచించారు. పుష్కరాల సన్నద్ధతలో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ట్రాఫిక్‌ నిర్వహణపై ఆర్‌ఎంసీ కమిషనర్‌ రాహుల్‌ మీనా, అదనపు ఎస్పీ దేవరాజ్‌ మనీష్‌ పాండే, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ప్రవేశ, నిష్కృమణ మార్గాలు, పుష్కర నగర్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, ప్రజలను నిలిపే ప్రాంతాలు, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాల సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను కమిషనర్‌ రాహుల్‌ మీనా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement