వైఎస్ జగన్‌కు ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకం బహుకరణ | Author Kothapalli Srinivasa Varma gifts Sthithapragnyudu to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌కు ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకం బహుకరణ

Oct 6 2026 6:33 PM | Updated on Oct 6 2026 7:30 PM

Author Kothapalli Srinivasa Varma gifts Sthithapragnyudu to YS Jagan Mohan Reddy

సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని బహుకరించారు.

వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవనయానం, ఆయన ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా వివరిస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో రచయితతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement