సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఆధారంగా చేసుకుని సీనియర్ రచయిత కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయం. రాజకీయ నాయకుడిగా ఆయన ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజలతో ఏర్పరచుకున్న విడదీయరాని అనుబంధాన్ని భావితరాలకు అందించేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది.
రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటన్నింటిని ఎదుర్కొంటూ వైఎస్ జగన్ స్థిర చిత్తంతో ముందుకు సాగిన తీరు అద్భుతం. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించిన రచయిత ప్రయత్నం ప్రశంసనీయమని సజ్జల కొనియాడారు.
ఇదీ చదవండి: పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్సార్‌సీపీ నేతలు


