తిరుమలలో మరోసారి రీల్స్‌ కలకలం | Reels in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరోసారి రీల్స్‌ కలకలం

Aug 18 2026 7:39 AM | Updated on Aug 18 2026 7:39 AM

Reels in Tirumala

తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్‌ వ్యవహారం చర్చనీయాంశమైంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్‌ చేశారు. సర్వదర్శనం క్యూలైన్‌ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్‌ సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 

తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనానికి వస్తూ రీల్స్‌ చేయడంపై ప్రశ్నలు సంధించారు. భక్తి పేరుతో ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేయడం సరికాదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్‌ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది. కొంతమంది కావాలనే ప్రచారం కోసం, వార్తల్లో నిలిచేందుకు రీల్స్‌ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement