టీమిండియాకు వైఎస్ జగన్‌ అభినందనలు | Asian Games Men's Cricket Final Pride of Telugu People YS Jagan Praises Tilak | Sakshi
Sakshi News home page

టీమిండియాకు వైఎస్ జగన్‌ అభినందనలు

Oct 3 2026 4:14 PM | Updated on Oct 3 2026 4:36 PM

Asian Games Men's Cricket Final Pride of Telugu People YS Jagan Praises Tilak

తాడేపల్లి: టీమిండియాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏషియ‌న్ గేమ్స్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన తెలుగు తేజం తిలక్‌ వర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 

ఫైనల్‌లో తిలక్‌ వర్మ ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమన్నారు. తిలక్‌ వర్మ అద్భుత ప్రదర్శన మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఏషియ‌న్ గేమ్స్‌ విజయంతో దేశానికి మరో చిరస్మరణీయ విజయాన్ని అందించిన టీమిండియాకు అభినందనలు చెప్పారు వైఎస్ జగన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement