Photo Credit: Twitter
ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సంచలనం సృష్టించాడు. తన ఉడుం పట్టుతో వరల్డ్ చాంపియన్‌ను మట్టికరిపించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో అమన్ షెరావత్ 11- 7తో నార్త్ కొరియాకు చెందిన ప్రపంచ చాంపియన్ చోంగ్ సాంగ్‌ను చిత్తు చేసి పసిడి పతకం అందుకున్నాడు. అంతకముందు జరిగిన థ్రిల్లింగ్ సెమీఫైనల్లో తజకిస్తాన్ రెజ్లర్ అయాల్ బెలోల్యుబ్స్కీని చిత్తు చేసిన అమన్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 20వ స్వర్ణం కావడం విశేషం. మరో స్వర్ణం వస్తే పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకోనుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 82 పతకాలు చేరగా.. ఇందులో 20 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలున్నాయి. ఇప్పటికే పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో రెజ్లింగ్‌లో భారత్‌కు రెండో పసిడి పతకం వచ్చినట్లయింది.
GOLD MEDAL FOR AMAN SEHRAWAT 🔥
STUNS REIGNING WORLD CHAMPION HAN CHONG-SONG 11-7 in FINAL
📸 @wrestling #AG2026withIAS #AichiNagoya2026 pic.twitter.com/hCmHpjX8eh— India_AllSports (@India_AllSports) October 3, 2026
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లోనే


