PC: BCCI/X
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఓపెనర్‌గా రోహిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 2 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్ మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 202 ఇన్నింగ్స్‌లలోనే అతడు ఈ ఘనత అందుకున్నాడు.
సచిన్ రికార్డ్ బ్రేక్
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. వన్డేల్లో ఓపెనర్‌గా 10,000 పరుగులు పూర్తి చేసుకునేందుకు సచిన్ 214 ఇన్నింగ్స్‌లు తీసుకోన్నాడు. తాజా నాక్‌తో మాస్టర్ బ్లాస్టర్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో పది వేలు పరుగులు చేసిన నాలుగో ఓపెనర్‌గా ఈ ముంబైకర్ నిలిచాడు.
కాగా రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో ఇప్పటికే మొత్తం 12,000కి పైగా పరుగులు సాధించాడు. అందులో 2,000 పరుగులు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసినప్పుడు సాధించినవి. ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ నాలుగో స్దానంలో ఉన్నాడు. మరో 179 పరుగుల చేస్తే క్రిస్ గేల్(10,179)ను రోహిత్ అధిగమిస్తాడు.
వన్డేల్లో ఓపెనర్‌గా వేగంగా 10,000 పరుగులు చేసిన బ్యాటర్లు
రోహిత్ శర్మ (భారత్) – 202 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 214 ఇన్నింగ్స్‌లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 268 ఇన్నింగ్స్‌లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 303 ఇన్నింగ్స్‌లు
వన్డేల్లో ఓపెనర్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్-4 బ్యాటర్లు:
సచిన్ టెండూల్కర్ (భారత్): 15,310 పరుగులు
సనత్ జయసూర్య (శ్రీలంక): 12,740 పరుగులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్): 10,179 పరుగులు
రోహిత్ శర్మ (భారత్): 10,000* పరుగులు
చదవండి: IND vs WI: విండీస్ బౌలర్ సూపర్ డెలివరీ.. విరాట్ కోహ్లి ఫ్యూజ్‌లు అవుట్


