Photo Credit: BCCI Twitter
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. జైడన్ సీల్స్ వేసిన అద్భుత బంతిని ఆడడంలో అంచనా తప్పిన కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డకౌట్ నేపథ్యంలో కోహ్లి ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో కోహ్లికి ఇది నాలుగో గోల్డెన్ డకౌట్ కాగా, అందులో మూడుసార్లు వెస్టిండీస్‌పైనే తాను ఆడిన ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం.

వన్డేల్లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌లు..
2011లో నార్త్‌సౌండ్ వేదికగా జరిగిన వన్డేలో డారెన్ సామీ బౌలింగ్‌లో తొలిసారి గోల్డెన్ డక్
2013లో ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో వన్డేలో టిమ్ బ్రెస్నన్ బౌలింగ్‌లో రెండోసారి గోల్డెన్ డక్
2019లో విశాఖపట్నం వేదికగా కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో మూడోసారి గోల్డెన్ డక్
తాజాగా చండీగఢ్ వేదికగా విండీస్ బౌలర్ జైడన్ సీల్స్ బౌలింగ్‌లో నాలుగోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే వెస్టిండీస్‌తో వన్డేల్లో మూడుసార్లు గోల్డెన్‌డక్ అయిన కోహ్లి.. ఇదే విండీస్‌పై వన్డేల్లో 2,429 పరుగులు చేయగా.. అందులో 10 సెంచరీలు ఉండడం విశేషం.

మరో చెత్త రికార్డు కూడా
గోల్డెన్ డక్స్‌తో పాటు కోహ్లి మరో చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ( వన్డే, టెస్టు, టీ20) కలిపి కోహ్లి ఇప్పటివరకు 41 సార్లు డకౌట్ అవ్వగా, భారత్ తరఫున అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43 సార్లు) తొలి స్థానంలో ఉండగా, ఇషాంత్ శర్మ (40 సార్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డేల్లో 19 సార్లు డకౌట్ అయిన కోహ్లి.. టెస్టుల్లో 15 సార్లు, టీ20ల్లో ఏడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
కలిసిరాని అక్టోబర్..
అక్టోబర్ నెల కోహ్లికి కలిసి రాలేదని చెప్పొచ్చు. గత మూడేళ్లలో కోహ్లి అక్టోబర్ నెలలోనే నాలుగుసార్లు డకౌట్ అవ్వడం గమనార్హం. 2024 అక్టోబర్‌లో తొలిసారి న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లి.. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి రెండుసార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా అక్టోబర్‌లోనే మరోసారి కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం విశేషం.
ఇదీ చదవండి: అమన్ చేతిలో వరల్డ్ చాంపియన్ చిత్తు; భారత్ ఖాతాలో 20వ స్వర్ణం


