‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి | UP Jhansi Father Celebrates Baby Girl Birth By Distributing Sweets And Gifts At Hospital, Wins Hearts Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘కంటే కూతుర్నే కనాలి’.. ఆస్పత్రిలో తండ్రి సందడి

Jul 18 2026 10:36 AM | Updated on Jul 18 2026 10:47 AM

Father Celebrates Daughters Birth with Heartwarming Act in Jhansi

ఝాన్సీ: కూతురు పుట్టిన వేళ.. ఒక తండ్రి చూపిన ప్రేమాభిమానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ఒక ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. తన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి కూతురు వస్తే, ఆ వేడుకను కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా, ఆస్పత్రిలోని వారందరితో కలిసి పంచుకోవాలని ఆ తండ్రి ముందే మొక్కుకున్నాడు. అనుకున్నట్లే కూతురు జన్మించగానే, ఆనందంతో ఆస్పత్రి వార్డులో ఉన్న రోగులకు, మహిళలకు, సిబ్బందికి స్వయంగా మిఠాయిలు పంచిపెట్టాడు. అంతేకాకుండా, వారికి బట్టలు, ఇతర కానుకలను కూడా అందజేశాడు.

ఆ తండ్రి చేస్తున్న ఈ వేడుకను చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కూతురు పుడితే వివక్ష చూపే వారికి, ఈ తండ్రి ప్రవర్తన ఒక పాఠంలా నిలుస్తోంది.  ప్రభుత్వం ‘బేటీ బచావో-బేటీ పఢావో’ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా, సమాజంలో పూర్తిస్థాయిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్ల పుట్టడం అనేది అదృష్టమని, అది ఒక గొప్ప పండుగ అని చాటిచెప్పిన ఈ తండ్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది మనసులను గెలుచుకుంటోంది. ఇలాంటి ఆలోచన ప్రతి ఇంట్లో ఉండాలని, అప్పుడే సమాజంలో లింగ వివక్ష తగ్గుతుందని నెటిజన్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement