మహారాష్ట్రలోని భూసావల్-వర్ధా ప్యాసింజర్ రైలులో ఒక యువతి తన ధైర్యసాహసాలతో నెట్టింట వైరల్‌గా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోకిరీకి విచిత్రమైన రీతిలో, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. తోటి ప్యాసింజర్లు కూడా ఆమెకు తోడవడంతో, నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తద్వారా వేధింపులకు భయపడి మౌనంగా ఉండకుండా గట్టిగా ప్రతిఘటించాలనే ధైర్యాన్నిచ్చింది.
కదులుతున్న రైలులో ఒక యువకుడు ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అంతే అసాధారణ ధైర్యం ప్రదర్శించి, తోటి ప్రయాణికుల సహాయంతో అతడిని పట్టుకుంది.ఆ పోకిరీకి చేతులకు గాజులు తొడిగి, పెదవులకు లిప్‌స్టిక్ పూసి అవమానించింది. ఆ కంపార్ట్‌మెంట్‌లోని చాలా మంది ఆ మహిళను చప్పట్లతో అభినందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది
A brave young woman on the Bhusawal-Wardha Passenger Train taught a sexual harasser a lesson he will never forget, in a unique and viral act of justice. When a young man behaved indecently with her inside the moving train, the woman showed remarkable courage and caught hold of… pic.twitter.com/PPOyN0YdKI
— Pune Mirror (@ThePuneMirror) July 17, 2026
వేధింపులపై మౌనంగా ఉండకుండా నిలబడిన ఈ సాహసికి, ఆమె తోటి ప్రయాణికులకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. అయితే గాజులు, బొట్టు పెట్టడం అంటే తిరిగి మనల్ని మనం అవమానించుకున్నట్టే.. కానీ ఏదో విధంగా ప్రతిఘటించడం అభినందనీయం అంటున్నారు కొంతమంది. మహిళలు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనప్పుడు పక్కన ఉన్నవారు జోక్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను మరికొందరు నొక్కి చెప్పారు. ఇలాంటి పోకిరీలకు తగిన శిక్ష విధించేలా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ


