ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్‌ తండ్రి పోరాటం! | History Repeats Sonam Wangchuk Follows Fathers Path of Hunger Strike | Sakshi
Sakshi News home page

ప్రధాని ఇందిర దిగివచ్చేలా.. వాంగ్‌చుక్‌ తండ్రి పోరాటం!

Jul 18 2026 7:59 AM | Updated on Jul 18 2026 8:29 AM

History Repeats Sonam Wangchuk Follows Fathers Path of Hunger Strike

న్యూఢిల్లీ: 1984లో లడఖ్ ప్రజల రాజ్యాంగ గుర్తింపు, షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టీ) హోదా కోసం సోనమ్ వాంగ్‌చూక్ తండ్రి సోనమ్ వాంగ్యాల్ చేపట్టిన నిరాహార దీక్షా ఉదంతం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వాంగ్యాల్ దీక్ష చేస్తున్న సమయాన, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా లేహ్ వెళ్లి ఆయనకు హామీ ఇచ్చారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత, ఇప్పుడు సోనమ్ వాంగ్‌చూక్ కూడా అదే బాటలో నిలిచారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వాంగ్‌చూక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే సామాజిక బాధ్యతతో ఆయన ఈ నిరసనను కొనసాగిస్తున్నారు. లడఖ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వాంగ్‌చూక్, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాగా, 1984లో వాంగ్యాల్ డిమాండ్ చేసిన విధంగానే, 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం లడఖ్‌కు ఎస్టీ హోదా కల్పించింది. తండ్రి పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న వాంగ్‌చూక్, ప్రస్తుతం తన దీక్షతో సంచలనం సృష్టిస్తున్నారు.

ఇది కూడా చదవండి: లిఫ్ట్‌లో శశిథరూర్ విలవిల..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement