తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుక్రవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని భయాందోళనకు గురయ్యారు. పీఎంజీ ప్రాంతంలోని హోటల్ ప్రశాంత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఆరో అంతస్తులో ఉండగా లిఫ్ట్ ఒక్కసారిగా మొరాయించడంతో థరూర్‌తో పాటు ఆయన బృందం సభ్యులు సుమారు 15 నిమిషాల పాటు లోపలే ఉండిపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హోటల్‌కు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బయటి నుంచి లిఫ్ట్ తలుపులను తెరిచి థరూర్‌ను, ఆయన వెంట ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. లిఫ్ట్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
#WATCH | Thiruvananthapuram, Keralam: Congress MP Shashi Tharoor got briefly stuck in the lift of a private hotel while arriving to attend the installation ceremony of the Rotary Club of Trivandrum East. Fire and Rescue Services personnel reached the spot and used a hydraulic… pic.twitter.com/EA0FtTHTqZ
— ANI (@ANI) July 17, 2026
ఘటన అనంతరం థరూర్ మాట్లాడుతూ.. తాము అందరం సురక్షితంగా ఉన్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ‘ముందుగా నేను లిఫ్ట్ నిర్వహణ సిబ్బందికి, ఆ తర్వాత హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. వారు విఫలం కావడంతో చివరికి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ వారికి కాల్ చేశాం’ అని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్‌కు దక్కింది ఇంతేనా?


