ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | kids animation web series Streaming on ott from this date | Sakshi
Sakshi News home page

Tollywood web series: ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jul 16 2026 10:14 PM | Updated on Jul 16 2026 10:27 PM

kids animation web series Streaming on ott from this date

ఓటీటీల్లో ఎ‍ప్పటికప్పుడు వినూత్న‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా స‌రికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ ఆనంద్ నీలకంఠన్ పిల్ల‌ల పుస్త‌కం ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫ‌ర్ కిడ్స్‌ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

మ‌న అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై స‌రికొత్త‌గా అందించ‌నున్నారు. క‌థ విష‌యానికి వ‌స్తే.. కుండక్క‌, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయ‌నుంది.

వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించ‌నుంది. హీరో అనే ప‌దం ఓ వ్య‌క్తి త‌ను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియ‌జేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్ర‌మే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.  ఈ క‌త‌లో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవ‌నే అభిప్రాయాన్ని ప్ర‌శ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహ‌సాల‌ ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుంద‌ని మ‌న‌కు అవ‌గ‌త‌మ‌వుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.

రైట‌ర్‌ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫ‌ర్ కిడ్స్‌’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్‌ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథల‌ను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్స్ రూపొందించ‌టం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్‌పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించ‌ద‌గ్గ విష‌యం' అని అన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement