లంకపై టెస్టు సిరీస్‌ గెలుపు.. విండీస్‌కు భారీ షాక్ | West Indies-Docked WTC points For-Slow-Over-Rate Vs Sri Lanka | Sakshi
Sakshi News home page

లంకపై టెస్టు సిరీస్‌ గెలుపు.. విండీస్‌కు భారీ షాక్

Jul 8 2026 9:46 PM | Updated on Jul 8 2026 10:15 PM

West Indies-Docked WTC points For-Slow-Over-Rate Vs Sri Lanka

శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టెస్టును డ్రా చేసుకొని 1-0తో సిరీస్ సొంతం చేసుకున్న‌ వెస్టిండీస్‌కు భారీ షాక్ త‌గిలింది. రెండో టెస్టులో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసినందుకు గాను మ్యాచ్ ఫీజులో 10 శాతం జ‌రిమానాతో పాటు వర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల‌లో రెండు పాయింట్లు కోత విధించినట్లు ఐసీసీ రిఫ‌రీ జ‌గ‌వ‌ల్ శ్రీనాథ్ వెల్లడించాడు. 

ఆర్టిక‌ల్ 2.22 ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ కింద ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించ‌డంతో పాటు ఆర్టిక‌ల్ 16.11.2 నిబంధ‌న‌ల ప్ర‌కారం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల‌లో రెండు పాయింట్లు కోత విధిస్తున్న‌ట్లు శ్రీనాథ్ పేర్కొన్నారు. కెప్టెన్ రోస్ట‌న్ చేజ్ త‌న త‌ప్పును అంగీక‌రించ‌డంతో విచార‌ణ అవ‌స‌రం లేకుండానే రిఫ‌రీ జ‌రిమానాతో స‌రిపెట్టారు.

ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో కొన‌సాగుతున్న వెస్టిండీస్ 10 టెస్టుల్లో ఒక విజ‌యంతో 16.67 పాయింట్లు క‌లిగి ఉంది. ఇక తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు 2027 డ‌బ్ల్యూటీసీ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నాయి.  ఇక శ్రీలంక‌, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది.  

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 9 వికెట్ల న‌ష్టానికి 549 ప‌రుగులు చేయ‌గా, విండీస్ 499 ప‌రుగులతో ధీటుగా బ‌దులిచ్చింది. ఆ త‌ర్వాత లంక త‌మ రెండో ఇన్నింగ్స్‌ను 251 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. 301 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన లంక చివ‌రి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 109 ప‌రుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి టెస్టులో శ్రీలంకపై వెస్టిండీస్ ఇన్నింగ్స్ 217 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

Read: వింబుల్డన్‌లో మారథాన్‌ గేమ్‌.. మెస్సీపై జకోవిచ్‌ జోకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement