సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.
రికార్డు స్థాయిలో దరఖాస్తులు
- ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు.
- మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
- ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి.
చీఫ్ మినిస్టర్ కప్ ప్రధాన ఉద్దేశం..
- గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం.
- రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం.
- క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.
- భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం.


