T20 WC 2026: అందరిది ఒకే మాట.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే..! | STAR SPORTS EXPERTS PICKS TOP 4 SEMI FINALISTS IN THIS T20 WORLD CUP 2026 | Sakshi
Sakshi News home page

T20 WC 2026: అందరిది ఒకే మాట.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!

Feb 20 2026 6:58 PM | Updated on Feb 20 2026 7:01 PM

STAR SPORTS EXPERTS PICKS TOP 4 SEMI FINALISTS IN THIS T20 WORLD CUP 2026

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ నిపుణులు కూడా ఈ టాపిక్‌పై తమ అంచనాలను షేర్‌ చేశారు.

స్టార్‌ స్పోర్ట్స్‌ ప్యానెల్‌లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్‌, ఛతేశ్వర్‌ పుజారా, మొహమ్మద్‌ కైఫ్‌, వరుణ్‌ ఆరోన్‌, సబా కరీం, సంజయ్‌ బాంగర్‌ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా కలిగి ఉన్నారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే టీమిండియా. ఈ ఆరుగురు సెమీస్‌కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు.

చహల్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు ఛాన్స్‌ ఇచ్చాడు.

కైఫ్‌ భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. వరున్‌ ఆరోన్‌ పై ముగ్గురికి భిన్నంగా భారత్‌తో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు.

సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయని గెస్‌ చేస్తున్నాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్‌ బాంగర్‌.. భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఈ నిపుణుల అంచనాల్లో ఎవరి అంచనాలు కరెక్ట్‌ అవుతాయో కామెంట్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement